జిల్లాకు చేరుతున్న విదేశీ విహంగాలు రైతుల మోముల్లో ఆనందం

                                                    జిల్లాకు చేరుతున్న విదేశీ విహంగాలు రైతుల మోముల్లో ఆనందం
శ్రీకాకుళం, జూన్‌ 3 (జనంసాక్షి):

విదేశీ విహంగాలు

జిల్లాకు చేరుతున్న విదేశీ విహంగాలు

తేెలుకుంచిలో రెండు చెరువుల్లో మాత్రం నీరు నిల్వ ఉండడంతో వాటితోనే ఈ పక్షులు జీవనాని ప్రారంభించాయి. వాతావరణంలో మార్పుల వల్ల సైబీరియా తీరం నుంచి సుమారు 13 వేల కిలో మీటర్లు ప్రయాణం చేసి వచ్చే ఈ విహంగాలను పెలికాన్‌ పక్షులని పిలుస్తుంటారు. నత్తగుల్లలు, చేపలు ప్రధాన ఆహారం తీసుకునే ఈ పక్షులు తేలుకుంచి గ్రామంలోని చెట్లపై  మాత్రమే నివాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. గ్రామ పొలిమేరలు దాటిన తరువాత ఉన్న చెట్లకు కూడా ఇవి వెళ్లవు. ఆహార అన్వేషణకు ఇచ్ఛాపురానికి సుమారు 35 నుంచి 40 కిలో మీటర్ల వరకు వెళ్ళి ఆహారంతో సహా తిరిగి తేలుకుంచిలో చెట్ల దగ్గరకు  చేరుకుంటాయి. ఈ పక్షుల రాక గ్రామానికి సుభిక్షమని, వాటికి ఏ హాని జరగకుండా చూసుకుంటామని గ్రామస్థులు చెబుతున్నారు. గత ఏడాది సర్వేల పేరిట హడావిడి చేసిన ఆటవీ శాఖధికారులు ఆపై ఊరుకున్నారు. గ్రామంలో నత్తగుల్లల కేంద్రాన్ని మాత్రం ఏర్పాటు చేశారు. వృక్షాలను వృద్ధి చేయాలని, చెట్లకు వలలు ఏర్పాటు చేయాలని, పక్షి పిల్లలను సంరక్షించేందుకు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులతో పాటు విహంగ ప్రేమికులు కోరుతున్నారు.

తాజావార్తలు