కవిత లిక్కర్‌ కేసు .. సీబీఐకి హైకోర్టు నోటీసులు


న్యూఢల్లీి(జనంసాక్షి):ఢల్లీి లిక్కర్‌ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢల్లీి హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. సీబీఐ కేసులో తన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ, బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఈ పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం.. సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మే24 వాయిదా వేసింది.