శబరిమల అయ్యప్పను దర్శించుకున్న పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు మే 15 (జనం సాక్షి)అయ్యప్ప స్వామి భక్తుడైన పైలెట్ రోహిత్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాది అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గత డిసెంబర్ లో శాసనసభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో అయ్యప్పస్వామిదర్శనంచేసుకోలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు శబరిమల ఆలయంలో భక్తులకు దర్శన సౌకర్యం కలిపించడంతో బుధవారం పైలెట్ రోహిత్ రెడ్డి సన్నిహితులతో కలిసి శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో గుర్వాయుర్ లో సామీ వారిని దర్శించుకున్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకునట్టు ఆయన తెలిపారు.