ధాన్యం కొనుగోలు చేయండి
` బీఆర్‌ఎస్ డిమాండ్
` రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై రైతులు కన్నెర్రజేశారు. వ్యవసాయానికి కరెంటు, నీళ్లు ఇవ్వకుండా ఏడిపించిన ప్రభుత్వం ఇప్పుడు పండిరచిన వడ్లు కొనకుండా గోస పెడుతున్న తీరుపై అన్నదాతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు.. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతులు, బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులపై ధర్నా చేపట్టారు.వడ్లకు రూ.500ల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.