తెలంగాణ ఉద్యమకారుడు మైలారం సంగమేశ్వర్ మృతి బాధాకరం

తాండూరు మే 15 (జనంసాక్షి) తెలంగాణ ఉద్యమకారుడు మైలారం సంగమేశ్వర్ మృతి బాధాకరమని ఆర్ బి ఓ ఎల్ సి ఈ ఓ
బుయ్యని శ్రీనివాసరెడ్డి విచారం వ్యక్తం చేశారు.
సంగమేశ్వర్ వృత్తి చెందిన విషయాన్ని
స్థానిక నాయకులతో తెలుసుకొని కుటుంబ సభ్యుల ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దీని శ్రీనివాస్ రెడ్డి అందుబాటులో లేనందున పట్టణంలోని 33 వ వార్డు వడ్డెర గల్లి కి సంబంధించిన నాయకులతో తన వంతు సహాయంగా పదివేల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా ఆర్బిఓఎల్ సీఈవో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన నాయకుడు తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం చేసిన యోధుడు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ప్రభుత్వ పరంగా అర్హత ఉన్న పథకాలు అమలు చేసే విధంగా తన వంతు కృషి చేస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.