తానూర్ లో కుక్కల దాడిలో ఇద్దరికీ వ్యక్తులకు గాయాలు

భైంసా మే 15 జనం సాక్షినిర్మల్ జిల్లా: తానూర్ మండల కేంద్రంలో కుక్కల దాడికి ఇద్దరు వ్యక్తులు గాయపడిన ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన శ్రీనివాస్,నాయాాబాది లో కేబుల్ పని చేస్తున్న క్రమంలో, మరియు భూమన్నకు కుక్కలు దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని తానూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో తరచూ కుక్కల దాడులు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు.