కవితకు మళ్లీ నిరాశే
` 20వరకు వరకు కస్టడీ పొడిగింపు
న్యూఢల్లీి(జనంసాక్షి): ఢల్లీి లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఆశించిన బీఆర్‌ఎల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె బియిల్ ఇవ్వని కోర్టు కస్టడీని మాత్రం పొడగించింది. మంగళవారంతో జుడీషియల్ కస్టడీ ముగిసినప్పటికీ మే 20 వ తేదీ వరకు పొడగిస్తూ ఢల్లీిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం కీలక విచారణ జరిగింది. కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ పొడగించాలని కోర్టును ఈడీ కోరింది. 8 వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేశామని ఈడీ తెలిపింది. దీంతో జుడీషియల్ కస్టడీని పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై మే 20 న విచారణ జరుపుతామని రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది.