తెలంగాణలో వర్సిటీలలో వీసీ నియామకానికి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతు(వీసీ)ల నియామకానికి ఎన్నికల కమిషన్‌ అనుమతిచ్చింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారమే వీసీల నియామకం జరుగుతుందని విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు.త్వరలో సెర్చ్‌ కమిటీల సమావేశం జరుగుతుందన్నారు.వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఉపకులపతుల మూడేళ్ల పదవీకాలం మే నెలాఖరుతో ముగుస్తుంది. ఈ క్రమంలో అర్హులైన ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తయింది. జేఎన్‌టీయూహెచ్‌, ఓయూ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ, తెలుగు, ఆర్కిటెక్చర్‌ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ), అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయాలకు కొత్త వీసీలను నియమించనున్నారు.