రేపు దేవరకొండకు రానున్న తీన్మార్ మల్లన్న

 

 

 

దేవరకొండ జనం సాక్షి మే 15

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశానికి తీన్మార్ మల్లన్న రాక

ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహం, కార్యాచర‌ణ‌పై చ‌ర్చించి, దిశానిర్దేశం

దేవరకొండ పట్టణంలోనీ పి పి ఆర్ కన్వెన్షన్ హాల్ నందు రేపు అనగా గురువారం ఉదయం 11:00 గంటలకు దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలునాయక్ ఆధ్వర్యంలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది,ఈ సమావేశానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముఖ్య అతిధులుగా విచ్చేయుచున్నారని బాలు నాయక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహం, కార్యాచర‌ణ‌పై చ‌ర్చించి, దిశానిర్దేశం చేయ‌నున్నారు.అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాల ముఖ్యనాయకులు, ప్రజా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, పట్టభద్రులు, అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి సమావేశాన్ని
విజయవంతం చేయలని కోరారు.