తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు

నగరంలో ఉరుములతో దంచికొట్టిన వాన
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం
పిగుడుపాటుకు ఇద్దరు మృతి
పలువురికి గాయాలు
పలు జిల్లాల్లో వర్షాలకు పంటలకు నష్టం
ఆదురుగగాలుతో పలుచోట్ల విద్యుత్‌ అంతరాయం
మరో ఐదు రోజులు వానలే!
వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
అధికారులకు సిఎం రేవంత్‌ ఆదేశాలు
హైదరాబాద్‌,రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి,వేములవాడ(జనంసాక్షి):తెలంగాణలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసాయి. హైదరాబాద్‌ నగరంలో కుండపోత వర్షం కురిసింది. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గచ్చిబౌలి, కూకట్‌పల్లి, నిజాంపేట్‌, హైదర్‌నగర్‌, బాచుపల్లి, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, బేగంపేట్‌, ప్యారడైజ్‌, చిలకలగూడ, అల్వాల్‌, జవహర్‌నగర్‌, మల్కాజిగిరి, నేరేడ్‌మెట్‌, నాగారం, కుత్బుల్లాపూర్‌, చింతల్‌, షాపూర్‌నగర్‌, గాజులరామారం, సూరారం, బహదూర్‌పల్లి, షేక్‌పేట, రాయదుర్గం, పంజాగుట్ట, బోరబండ, రెహమత్‌నగర్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏకధాటిగా బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షానికి భారీ వృక్షాలు నేలకూలాయి. వర్షానికి జనజీవనం స్థంభించింది. పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిరది. మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోనూ వర్షం కురుస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, కోకాపేట్‌, హిమాయత్‌ నగర్‌, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు మొదలయ్యాయి. మరోవైపు, వచ్చే 5 రోజులపాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. గురువారం మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.విూల వేగంతో గాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ఐదు రోజుల పాటు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో హెచ్చరికలను జారీ చేసింది. బుధవారం తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగిన ఆవర్తనం గురువారం మధ్యప్రదేశ్‌ నైరుతి ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో విూటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోకి క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నట్లు పేర్కొంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం
రాజన్నసిరిసిల్ల జిల్లాలో కురిసిన భారీ వర్షానికిపిడుగు పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. తంగళ్లపల్లి మండలం భరత్‌నగర్‌లో పిడుగుపాటుకు రామడుగు చంద్రయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. అలాగే వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని శాత్రాజ్‌పల్లిలో కంబాల శ్రీనివాస్‌ మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కాగా, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు రహదారుల పక్కన చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల ఇండ్ల పైకప్పులు గాలికి కొట్టుకుపోయాయి. విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడిరచిన సంగతి తెలిసిందే. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురిసింది. ఇదిలావుంటే సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు వట్‌ పల్లి, కోహిర్‌ మండలాల్లో వర్షం కురిసింది. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌, పాపన్నపేట మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వాన పడిరది. సంగారెడ్డి పట్టణంలో భారీ వర్షం కురిసింది. అరగంట వ్యవధిలో సంగారెడ్డి పట్టణం తడిసి ముద్దయింది. రోడ్లపై భారీగా పారుతున్న వరద నీటితో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట వర్షపు నీరు భారీగా నిలిచింది. పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో డ్రైనేజీలు పొంగిపొర్లుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలి దుమారానికి పలు చోట్లు చెట్ల కొమ్మలు విరిగిపడగా.. బారికేడ్లు నెలకొరిగాయి. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో వరిపొలాలు కోసి ధాన్యాన్ని కుప్పగా పోసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి.
మరో ఐదు రోజులు వానలే!
మరోవైపు, వచ్చే 5 రోజులపాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. గురువారం మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.విూల వేగంతో గాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ఐదు రోజుల పాటు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో హెచ్చరికలను జారీ చేసింది. బుధవారం తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగిన ఆవర్తనం గురువారం మధ్యప్రదేశ్‌ నైరుతి ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో విూటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోకి క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గచ్చిబౌలి, కూకట్‌పల్లి, నిజాంపేట్‌, హైదర్‌నగర్‌, బాచుపల్లి, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, బేగంపేట్‌, ప్యారడైజ్‌, చిలకలగూడ, అల్వాల్‌, జవహర్‌నగర్‌, మల్కాజిగిరి, నేరేడ్‌మెట్‌, నాగారం, కుత్బుల్లాపూర్‌, చింతల్‌, షాపూర్‌నగర్‌, గాజులరామారం, సూరారం, బహదూర్‌పల్లి, షేక్‌పేట, రాయదుర్గం, పంజాగుట్ట, బోరబండ, రెహమత్‌నగర్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు
నగరంలో భారీ వర్షం కురుస్తోంది. వరదలతో హైదరాబాద్‌ రోడ్లు జలమయమయ్యాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.9లో నాలాపై రోడ్డు కుంగిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది.ఉదయ్‌నగర్‌లో నాలా పైకప్పు కూలింది. వరద నీటిలో పలు ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. నాలా కూలిన ప్రాంతాల్ని మేయర్‌ విజయలక్ష్మి పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు బల్కంపేట రైల్వే అండర్‌పాస్‌ కింద వరదనీటిలో కారు మునిగిపోయింది. రాత్రి వేళ పలు చోట్ల వడగళ్ల వాన పడుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లతో కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ సవిూక్ష నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఆలస్యంగా వెళ్లాలని కమిషనర్‌ సూచించారు. అత్యవసరం అయితేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని చెప్పారు.