టెన్త్‌లో పక్కా ప్రణాళిక

share on facebook

వరంగల్‌,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): కలెక్టర్‌ ఆదేశాలతో పదో తరగతి ఫళితాలపై పక్కా ప్రణాళిక అమలు చేయబోతున్నామనిజిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ఈ మేరకు పాఠశాలలకు ఆదేశాలు ఇస్తామని అన్నారు. ఇందుకోసం ఎంఈవోలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. పదోతరగతిలో వెనుకబడిన విద్యార్థులు వివరాల నివేదికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ప్రణాళిక సిద్దం చేస్తామని డిఇవో చెప్పారు. పదో తరగతి ఫలితాలలో ఉత్తీర్ణత శాతం పెంచడంతోపాటు ప్రతి పాఠశాల నుంచి 10 మందికి 9.5 గ్రేడ్‌ సాధించే విధంగా బోధనా ప్రణాళికా రూపొందించుకోవాలని అర్బన్‌ జిల్లా విద్యాశాఖాధికారులకు అర్బన్‌ కలెక్టర్‌ కె.ఆమ్రపాలి ఆదేశించారు. గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. సాంఘిక సంక్షేమ, రెసిడెన్సియల్‌ స్కూళ్లలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల గురించి అడిగి తెలుసుకున్న కలెక్టర్‌ కేజీబీవీ ప్రిన్సిపాళ్లు కూడా అదే తరహాలో తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆచరణకు కసరత్తు చేస్తామని అన్నారు.

Other News

Comments are closed.