పురానా షహర్‌ కరోనా కే బహార్‌

share on facebook

పాతబస్తీకి తవంచిన కరోనా
హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో నభై శాతానికి పైగా పాజిటివిటీ
పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో 99 శాతం నెగిటివ్‌
పాతబస్తీ మొత్తం విూద ఐదు శాతం లోపే పాజిటివిటీ
ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న వైద్యవర్గాు
వసు తక్కువగా ఉండటం, పౌష్టికాహారం తీసుకోవడమే కారణమని భావిస్తున్న నిపుణు
హైదరాబాద్‌, మే 12 (జనంసాక్షి) : రెండో విడత విజృంభించిన కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ పరిస్థితు సృష్టించింది. సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్‌ లో కరోనా ఉదృతి తీవ్రరూపం దాల్చి లాక్‌ డౌన్‌ అము చేస్తుండటంతో ఇప్పుడు తెంగాణ ప్రభుత్వం కూడా లాక్‌ డౌన్‌ ప్రకటించింది. రాష్ట్రంలో దాదాపు నభై శాతం కరోనా పాజిటివ్‌ కేసు హైదరాబాద్‌ తో పాటు శివారు జిల్లాలోనే నమోదవుతున్నాయి. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కరోనా టెస్టులో 40 నుంచి 50 శాతం పాజిటివ్‌ గా ఉంటున్నాయి. కానీ హైదరాబాద్‌ పాతబస్తీలో మాత్రం పాజిటివిటీ రేట్‌ అత్య్పంగా ఉంటుంది. స్థానికంగా ఉన్న పీహెచ్‌ సీల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి సంఖ్య పది శాతంలోపే వుండడం పట్ల వైద్యవర్గాు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాతబస్తీ పీహెచ్‌సీలో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కొవిడ్‌ పరీక్షు చేస్తున్నారు. వారిలో 5 శాతం మంది కూడా పాజిటివ్‌గా తేడం లేదు. పాతబస్తీలోని 18 ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షు చేస్తున్నారు. దారుల్‌షిపా ఆరోగ్య కేంద్రంలో ఈ నె 10న 50 మందికి పరీక్షు చేస్తే వారిలో ఒక్కరు మాత్రమే పాజిటివ్‌గా తేలారు. వైరస్‌ను కచ్చితంగా పట్టుకోగలిగే ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లోనూ పాజిటివ్‌ రేటు అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఇక దారుల్‌షిఫా, అజాంపుర, యాకుత్‌పుర ఆరోగ్య కేంద్రాల్లో చేస్తున్న పరీక్షల్లో 99 శాతం మంది నెగటివ్‌గానే బయటపడుతున్నారు. మరీ ముఖ్యంగా యాకుత్‌పుర`2 పీహెచ్‌సీ పరిధిలో పాజిటివ్‌ రేటు సున్నాగా ఉండడం గమనార్హం. ఈ పీహెచ్‌సీ పరిధిలో ఇప్పటి వరకు 471 మందికి పరీక్షు చేస్తే ఒక్కరు కూడా కొవిడ్‌ బారినపడినట్టు నిర్ధారణ కాలేదు. కరోనా విస్తృతిని అడ్డుకోవాంటే వ్యక్తిగత శుభ్రతతో పాటు భౌతిక దూరం పాటించాల్సిందేనని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇరుకు గల్లీతో కూడుకున్న పాతబస్తీలోని ఇళ్లలో జనసాంద్రత ఎక్కువే అనేది కూడా గమనించాల్సిన అంశం. శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వరు అనే అపప్రద కూడా పాతబస్తీ వాసుపై ఉన్నది. అయినప్పటికీ పాతబస్తీలో వైరస్‌ వ్యాప్తి అంతంత మాత్రమేనని ప్రభుత్వ గణాంకాను పరిశీలిస్తే స్పష్టం అవుతోంది. వసు తక్కువగా ఉండడం, సుగంధ ద్రవ్యాతో పాటు డ్రైఫ్రూట్స్‌ వినియోగం ఎక్కువ ఉండటంతో పాతబస్తీలో కరోనా ప్రభావం తక్కువగా ఉందని వైద్యనిపుణు విశ్లేషిస్తున్నారు. ఎక్కువగా బిర్యానీ, హలీం లాంటి పౌష్టికాహారం తినడం వ్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, పాతబస్తీలో పాజిటివిటీ రేటు తక్కువగా ఉండటానికి ఇది కూడా ఒక కారణమై ఉంటుందని నిపుణు భావిస్తున్నారు.

Other News

Comments are closed.