ప్రేమపేరుతో యువతిని వంచించిన యువకుడు

share on facebook

అవమానం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

మహబూబాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): మరిపెడ మండలం తానం చర్ల శివారు జెండాల తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మైనర్‌ను ఓ యువకుడు ప్రేమ పేరుతో వంచించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత సదరు యువకుడు మొహం చాటేశాడు. దీంతో మైనర్‌ తండ్రి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గ్రామ పెద్దలు సైతం తన కుటుంబానికి న్యాయం చేయలేదంటూ.. మనస్తాపానికి గురైన తండ్రి భూక్య ఠాగూర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఠాగూర్‌ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Other News

Comments are closed.