బల్దియాలో అనూహ్య ఫలితాలు

share on facebook

55 సీట్లకే పరిమితమైన టీఆర్‌ఎస్‌

48 సీట్లు గెల్చుకున్న కమలదళం

44 సీట్లతో సత్తా చాటిన ఎంఐఎం

– సింగిల్‌లార్జెస్ట్‌గా టీఆర్‌ఎస్‌

– బలం పుంజుకుని భాజపా రెండో స్థానం

– పాతబస్తీలో పట్టునిలుపుకున్న పతంగి

– చతికిలపడ్డ హస్తం

– అంచనా తప్పిన ఎగ్జిట్‌ ఫోల్స్‌

హైదరాబాద్‌,డిసెంబరు 4(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఓటరు అస్పష్ట తీర్పు ఇచ్చారు. ఏ పార్టీకి మెజార్టీ లేకుండా తమ తీర్పును ఇవ్వడంతో మేయర్‌ పీఠంపై సందిగ్ధత నెలకొంది. మొత్తంగా హంగ్‌ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తుదిఫలితాలు వెలువడే సరికి అధికార టిఆర్‌ఎస్‌ 56 సీట్లకు పరిమితం కాగా..కేవలం 7సీట్ల తేడాతో 49స్థానాలు గెల్చుకుని బిజెపి రెండోస్థానంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ 2సీట్లకే పరిమితం కాగా, ఎంఐఎం సత్తాచాటి 43 స్థానాలు గెల్చుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో నాలుగు స్థానాలతో ఉన్న బిజెపి దూసుకుని వచ్చి 49 స్థానాలు గెల్చుకోవడం విశేషం. గతంలో ఒక్కసీటు ఉన్న కాంగ్రెస్‌ ఇప్పుడు రెండు సీట్లను గెల్చుకుంది. అయితే ఓటమి అవమానంతో పార్టీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పిసిసి అధ్యక్షపదవికి రాజీనామా చేయడం కొసమెరుపు. ఇకపోతే ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు దండిగా పోటీ చేసినా ఒక్కరు కూడా గెలుపొందలేదు. అత్యదిక స్థానాలు గెల్చుకున్న పార్టీగా మేయర్‌ పీఠం దక్కించుకునే అవకాశం అధికార టిఆర్‌ఎస్‌కు వచ్చింది. 56 స్థానాలతో పాటు 36 ఎక్స్‌ అఫీషియో సభ్యుల మద్దతుతో పాటు ఎంఐఎం మద్దతు తప్పనిసరి కానుంది. ఈ క్రమంలో మేయర్‌ సీటు టిఆర్‌ఎస్‌ డిప్యూటి మేయర్‌ సీటు ఎంఐఎంకు దక్కే ఛాన్స్‌ ఉంది. అయితే ఈ విషయంలో మరింత స్పష్టత రానుంది. ఫలితాలపై టిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌, కెటిఆర్‌లు సవిూక్షిస్తున్నారు. భవిష్యత్‌ కార్యాచరణలో నిమగ్నమయ్యారు. మరోవైపు టిఆర్‌ఎస్‌ మేయర్‌ పీఠం కోసం పావులు కదుపుతోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో 56 డివిజన్లలో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌.. మేయర్‌ అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టింది. 111 డివిజన్‌ భారత్‌ నగర్‌లో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింధు ఆదర్శ్‌ రెడ్డి ప్రగతి భవన్‌కు రావాలని పిలుపు అందుకున్నట్లు సమాచారం. కాగా సింధు ఆదర్శ్‌ రెడ్డి.. మెదక్‌ ఎమ్మెల్సీ భూపాల్‌ రెడ్డి కోడలు కావడం విశేషం. గ్రేటర్‌ కౌంటింగ్‌లో తొలుత మెహదీపట్నం డివిజన్‌ ఫలితం మొదటిగా వెలువడంతో ఎంఐఎం విజయం సాధించింది. ఇక కూకట్‌పల్లి డివిజన్‌లో అధికార టిఆర్‌ఎస్‌ స్వీప్‌ చేసింది. మంత్రులు ఇన్‌ఛార్జీలు గా ఉన్న ప్రాంతాల్లో బిజెపి గెల్చింది. కెసిఆర్‌ తనయ ఎమ్మెల్సీ కవిత ఇన్‌చార్జీగా ఉన్న గాంధీనగర్‌లో బిజెపి గెల్చింది. ముషీరాబాద్‌ డివిజన్‌లో మొత్తం బిజెపి స్వీప్‌ చేయడం విశేషం. రాంనగర్‌లో మాజీ ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి పరాజ యం పాలయ్యారు. మంత్రులు జగదీవ్వర్‌ రెడ్డి, శ్రీనివాస గౌడ్‌,తలసాని, సబితా ఇంద్రారెడ్డి తదితరులకు షాక్‌ తగిలింది. మంత్రి సత్య వతి ప్రచారం చేసిన ఉప్పల్‌ చిలుకా నగర్‌లో మాత్రం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపొందారు. ఇకపోతే వరదప్రభావిత ప్రాంతాల్లో బిజెపి భారీ విజయం నమోదు చేసుకుంది. ఇక 8వ డివిజన్‌ హబ్సిగూడ నుంచి పోటీ చేసిన ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి సతీమణి స్వప్నపై బిజెపి అభ్యర్థి చేతన గెలుపొందారు. అలాగే ముషీరాబాద్‌లో ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ మరదలు కూడా ఓటమి పాలయ్యారు.

గోషామహల్‌లో ఆరు డివిజన్లు బీజేపీవే..

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్‌ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లను బీజేపీ గెలుచుకుంది. బేగంబజార్‌ – శంకర్‌ యాదవ్‌, గోషామహల్‌ – లాల్‌ సింగ్‌, మంగళ్‌ హాట్‌ – శశి కళ, జాంబాగ్‌ – రాకేష్‌ జైస్వాల్‌, గన్‌ ఫౌండ్రి- డాక్టర్‌ సురేఖ ఓం ప్రకాష్‌లు విజయం సాధించారు. హయత్‌నగర్‌, నాగోల్‌, మాన్సూరాబాద్‌ డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. హయత్‌ నగర్‌ డివిజన్‌లో కళ్ళెం నవ జీవన్‌రెడ్డి, నాగోల్‌ డివిజన్‌లో చింతల అరుణ సురేందర్‌ యాదవ్‌, మాన్సూరాబాద్‌ డివిజన్‌లో కొప్పుల నర్సింహారెడ్డి గెలుపొందారు. మౌలాలి, మూసాపేట్‌ డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మౌలాలి డివిజన్‌లో సునీత యదవ్‌, మూసాపేట్‌ డివిజన్‌లో కోడిచర్ల మహేందర్‌ గెలుపొందారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థన మేరకు బీఎన్‌ రెడ్డి నగర్‌లో అధికారులు రీ కౌంటింగ్‌ జరిపారు. 16 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. అయితే తమకు అనుమానం ఉందంటూ టీఆర్‌ఎస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రీకౌంటింగ్‌ కోరింది. దాంతో అధికారులు మళ్లీ కౌంటింగ్‌ జరపగా చివరకు బిజెపి అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. ఇకపోతే వరదప్రభావిత కొత్తపేట, సరూర్‌నగర్‌, గడ్డి అన్నారం, వినాయక్‌నగర్‌, రామంతపూర్‌ డివిజన్లలో బీజేపీ విజయం సాధించింది. కొత్తపేటలో నాగకోటి పవన్‌కుమార్‌, సరూర్‌నగర్‌లో ఆకుల శ్రీవాణి అంజన్‌, గడ్డి అన్నారంలో బద్ధం ప్రేమ్‌ మహేశ్వర్‌ రెడ్డి, వినాయక్‌నగర్‌లో రాజ్యలక్ష్మి, అవిూర్‌పేటలో కేతినేని సరళ, రామంతపూర్‌లో బండారు శ్రీవాణి గెలుపొందారు. చిలుకానగర్‌ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి గోనె శైలజ 200 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఖైరతాబాద్‌లో దివంగత పి. జనార్దన్‌ రెడ్డి తనయ,టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయారెడ్డి విజయం సాధించారు. కూకట్‌పల్లిలో జూపల్లి సత్యనారాయణ గెలుపొందారు. హస్తినపురంలో బీజేపీ అభ్యర్థి సుజాత నాయక్‌ 680 ఓట్లతో గెలుపొందారు. కె.పి.హెచ్‌.పీ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మందాడి శ్రీనివాసరావు 1540 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వనస్థలిపురం డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి రాగుల వెంకట్‌ రెడ్డి గెలుపొందారు. నాచారం డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శాంతి సాయిజన్‌, జగద్గిరిగుట్ట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జగన్‌ విజయం సాధించారు. హబ్సిగూడలో బీజేపీ అభ్యర్థి కే. చేతన గెలుపొందారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి బొంతు శ్రీదేవీ గెలుపొందారు. చర్లపల్లి డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగిన ఆమె విజయం సాధించారు. ఇక 8వ డివిజన్‌ హబ్సిగూడ నుంచి పోటీ చేసిన ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి సతీమణి స్వప్నపై బిజెపి అభ్యర్థి చేతన గెలుపొందారు. కూకట్‌పల్లి జోన్‌లో ఇరవై డివిజన్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కొనసాగింది. 22 డివిజన్లకు 19 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉంది. కూకట్‌పల్లి జోన్‌లో మూడు చోట్ల బీజేపీ ఆధిక్యం కొనసాగుతుంది. ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ రెండు డివిజన్లను గెలుచుకుంది. ఏఎస్‌ రావు నగర్‌, ఉప్పల్‌ను ‘హస్త’గతం చేసుకుంది. ఏఎస్‌ రావు నగర్‌లో సింగిరెడ్డి శిరీషా రెడ్డి, ఉప్పల్‌లో మందముల్లా రజిత విజయం సాధించారు. చింతల్‌ డివిజన్‌లో ఆ పార్టీ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ ఆభ్యర్థి రషీదా బేగం గెలుపొందారు. అవిూర్‌పేట్‌ను బీజేపీ గెల్చుకుంది. సనత్‌ నగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కొలను లక్ష్మి రెడ్డి దాదాపు 2429 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. పాతబస్తీలో ఎంఐఎం పార్టీ తన హవా కొనసాగించింది.

Other News

Comments are closed.