బోధన్‌ కోర్టుకు హాజరైన తీన్మార్‌ మల్లన్న

share on facebook

నిజామాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి  ) : జిల్లాలోని బోధన్‌ కోర్టుకు తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం నిజామాబాద్‌ జిల్లాలో కల్లు వ్యాపారులను బెదిరించిన కేసులో తీన్మార్‌ మల్లన్నపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసి తీన్మార్‌ మల్లన్న రిమాండ్‌ కు పంపారు. ఈ నెల మొదటి వారంలో బెయిల్‌ రాగా..శుక్రవారం కేసు వాదనల నేపథ్యంలో బోధన్‌ కోర్టుకు వచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. కోర్టు ఎప్పుడు పిలిచినా వచ్చి నేరుగా హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు.

Other News

Comments are closed.