మేమనుకోలేదు

share on facebook

– స్వల్పతేడాతో..

– ఈ విజయం కార్యకర్తలకు అంకితం: కేటీఆర్‌

హైదరాబాద్‌,డిసెంబరు 4(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితం రాలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. మరో 20-25 స్థానాలు అదనంగా వస్తాయని భావించినట్లు చెప్పారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ తెరాసే గెలుస్తుందని చెప్పాయని.. కొన్ని డివిజన్లలో చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయామన్నారు. బీఎన్‌ రెడ్డిలో 18, మౌలాలి 200, మల్కాజిగిరి 70, అడిక్‌మెట్‌లో సుమారు 200, మూసాపేట్‌లో సుమారు 100 ఓట్ల తేడాతో పరాజయం పాలైయ్యామన్నారు. కనీసం 10-12 స్థానాల్లో 200-300 ఓట్ల వ్యవధితో తెరాస ఓటమి చెందిందని కేటీఆర్‌ చెప్పారు. అయితే పార్టీ శ్రేణులు దీనికి నిరాశ చెందాల్సిన అవసరంలేదని.. ఎక్కువ సీట్లు వచ్చిన అతిపెద్ద పార్టీగా తెరాసకు ప్రజలు అవకాశం కల్పించారన్నారు. ఫలితాలను పార్టీలో విశ్లేషించుకుంటాని తెలిపారు. మేయర్‌ పీఠంపై ఓ విూడియా ప్రతినిధి ప్రశ్నించగా.. జీహెచ్‌ఎంసీ పాలకమండలికి ఇంకా 2నెలల సమయముందని బదులిచ్చారు. అన్ని అంశాలను పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్‌ స్పష్టంచేశారు. పార్టీకి విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు పార్టీ ఆదేశాల మేరకు ప్రతి డివిజన్‌కు వచ్చి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన తెరాస నేతలు, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు.

Other News

Comments are closed.