.11నుండి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు. డీఈఓ గోవిందరాజులు.నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జనవరి3(జనంసాక్షి):
విద్యాశాఖ ఆధ్వర్యంలో డ్రాయింగ్, టైలరింగ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ గోవిందరాజులు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.పరీక్షల నిర్వహణకు జిల్లా కేంద్రంలో 4 కేంద్రాలు ఏర్పాటుచేయగా, డ్రాయింగ్ లోయర్ లో 371, డ్రాయింగ్ హైయర్ లో 241, టైలరింగ్ హైయర్ మరియు లోయర్ లో 160 మంది అభ్యర్థులు టెక్నికల్ కోర్స్ పరీక్షలకు హాజరుకానున్నారని డిఈవో తెలిపారు.కోర్సుల ఆధారంగా పరీక్ష సమయం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఉంటుందని డీఈఓ పేర్కొన్నారు.టెక్నికల్ కోర్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు మరియు పుట్టిన తేదీని ఎంట్రీ చేసి www.bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని డిఇఓ ఒక ప్రకటనలో తెలియజేశారు.అభ్యర్థులు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే నాగర్ కర్నూల్ డిఈఓ కార్యాలయం లో జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు ను సంప్రదించాలని ఆయన కోరారు.
11నుండి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు. డీఈఓ గోవిందరాజులు
Other News
- కొన్నే బీడీ కాలనీ పట్టా భూముల్లో ఇళ్ల ను నిర్మించాలి
- మొక్కజొన్న పంటలను పరిశీలించిన అదనపు కలెక్టర్
- విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ లు మరియు పెన్నులు పంపిణీ
- విద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళవిద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళ
- మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
- నాయకులురాయికోటి నర్సిములు ను సన్మానించిన యువ నాయకులు
- పేపర్ లీకేజీ పై కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి పేపర్ లీకేజీ పై కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి రాష్ట్ర ఒ బిసి మోర్చ
- మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
- చారిత్రాత్మకమైన జీవో నెంబర్ 11 ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పేస్కేలుచారిత్రాత్మకమైన
- ఉగాది సందర్భంగా భీమన్న ఆలయం వద్ద అన్నదాన