అమెరికా మారథాన్ పోటీలో బుర్ర లాస్యకు పథకం

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షీ):అమెరికాలోని మారథాన్ పోటీలో భూపాలపల్లికి చెందిన బుర్ర లాస్య గౌడ్ ప్రతిభ కనబరిచి పథకం సాధించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రానికి చెందిన బుర్ర రమేష్, సునిత దంపతుల కూతురు లాస్య అమెరికాలో విద్యనభ్యసిస్తుంది. కాగా అమెరికాలోని అలాభామా స్టేట్స్ హన్స్ విల్ సిటీలో రాకెట్ సిటి మారథాన్ 21 కిలో మీటర్ల విభాగంలో
పాల్గొన్న లాస్య గౌడ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెడల్ సాధించింది. అమెరికాలో పాల్గొన్న ఏకైక తెలంగాణ అమ్మాయిగా లాస్య కీర్తి గడించింది. ప్రతిభ కనబర్చిన లాస్యను అలాభామా యూనివర్శిటీ అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు.
గతంలో కూడా లాస్య 21 సంవత్సరాలకే ఐసీసీ క్రికెట్ కోచ్ లెవెల్ వన్ సర్టిఫికెట్ అందుకుంది. లాస్య గౌడ్ అమెరికాలోని మీనాసోటా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు తెలంగాణ అండర్ 19 క్రికెటర్ పోటిలలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న లాస్య విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు బిఅర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, జిఎంఅర్ ట్రస్ట్ చైర్మన్ గండ్ర గౌతమ్ రెడ్డి, సింగరేణి స్పోర్ట్స్ సూపర్ వైజర్ పర్స శ్రీనివాస్, అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పొక్కూరి చినరాజయ్య, పూతల సమ్మయ్య క్రికెట్ కోచ్ శ్రీనివాస్ లు బుర్ర లాస్య గౌడ్ ను అభినందించారు.



