బొగ్గు మనది.. కరెంట్‌ కేంద్రాలు ఆంధ్రోళ్లకా ?

share on facebook


తెలంగాణలో పవర్‌ ప్రాజెక్టులు నిర్మించాల్సిందే
రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 (జనంసాక్షి) :
తెలంగాణ బొగ్గుతో కరెంట్‌ తయారు చేస్తే ఆంధ్రోళ్లు కరెంట్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందుతున్నారని రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. మంగళవారం న్యూ ఎమ్మెల్యే క్వార్ట ర్స్‌లోని జేఏసీ కార్యాలయంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ (తెఈఆ) జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 5న మింట్‌ కంపైండ్‌లో నిర్వహిం చతలపెట్టిన బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పవర్‌ ప్రాజెక్టులు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. సీమాంధ్రులు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు దోచుకునేందుకే సమె ౖక్యాంధ్ర అంటున్నారన్నారు.  టీఎన్జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసా ద్‌రావు మాట్లాడుతూ తెలంగాణ నిరంతరంగా వెలిగిపోవలంటే సీమాంధ్ర పాలన పోవాలన్నారు. ప్రజలు, రైతుల అవసరాలు తీరాలంటే తెలంగాణకు కేటాయించిన నాలుగు పవర్‌ ప్లాంట్ల నిర్మాణం వెంటనే మొదలవ్వాలని అన్నారు. అనంతరం గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ ఆంధ్రోళ్లు లైట్లు చూడకముందే తెలంగాణలో పవర్‌ ప్లాంట్లు ఉన్నాయని సీమాంధ్రులు తెలుసుకోవాలన్నారు. తమ ప్రాంతం వలస పాలనలోకి వెళ్లిన తరువతే అంధకారంలోకి వెళ్లిందన్నారు. ఇక్కడున్న వనరుల్ని సద్వినియోగం చేసుకుంటే తెలంగాణ అవసరాలకు కావాల్సిన విద్యుత్‌తో పాటు ఆంధ్ర ప్రాంతానికి కూడా కరెంట్‌ అందించవచ్చునని అన్నారు. ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల ఐకాస ఛైర్మన్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన బహిరంగ టెండర్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి 700 ఎంటీపీఏల బొగ్గును కేటాయిం చిందన్నారు. దీంతో ఆరు వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చు నన్నారు. ప్రస్తుతం తెలంగాణకి 6,500 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 4,500 మాత్రం ఉంది. డిమాండ్‌ను పూర్తి చేయడానికి మరో 2000 మెగాయూనిట్ల అవసరం ఉందన్నారు. అయితే తెలంగాణకు కేటాయించిన కొత్త ప్రాజెక్టులు వెంటనే నిర్మిస్తే ఏ లోటు ఉందన్నారు. కార్యక్రమంలో గెజిటెడ్‌ అధికారుల సంఘం గ్రేటర్‌ అధ్యక్షుడు ఎం.బి.కృష్ణామాదవ్‌, ఐకాస నేతలు శివాజీ, జానయ్య, ఎం.వెంకన్నగౌడ్‌, భాస్కరరెడ్డి, శ్యాం మనోహర్‌, జనప్రియ, రాజరామరెడ్డి, స్వామిరెడ్డి, వెంకటేశ్వర్లు, నటేశ్‌ కుమార్‌, చంద్రయ్య, భద్రయ్య, చంద్రుడు, రాజేశ్‌, గోపాలరావు, హరివర్థన్‌, రమేశ్వరయ్య, సంపత్‌రావు, మధుసూధన్‌రెడ్డి, సమ్మయ్య పాల్గొన్నారు.

Other News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *