మహిళా ఐఏఎస్‌ కథనం కేసులో.. ముగ్గురు జర్నలిస్టుల అరెస్టు


కించపరిచే విధంగా 44 యూట్యూబ్‌ ఛానల్స్‌ కథనాలు
అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం
కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తుండగా అరెస్ట్‌ చేశాం
మీడియాతో నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జన్నార్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిని కించపరిచేలా వార్తలు ప్రసారం చేసిన కేసులో సెంట్రల్‌ కైమ్ర్‌ స్టేషన్‌ పోలీసులు దూకుడు పెంచారు. తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల సంఘం తరఫున సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జయేశ్‌ రంజన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు డిజిటల్‌ విూడియా, యూట్యూబ్‌ ఛానల్స్‌పై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఓ ఛానల్‌ ఇన్‌పుట్‌ ఎడిటర్‌తో పాటు ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్‌ చేశారు. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తుండగా ఇన్‌పుట్‌ ఎడిటర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలాగే.. మహిళా ఐఏఎస్‌ను కించపరిచే విధంగా 44 యూట్యూబ్‌ ఛానల్స్‌ కథనాలు ప్రసారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఆయా యూట్యూబ్‌ ఛానళ్లపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఛానల్స్‌ బాధ్యులను గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు సీసీఎస్‌ పోలీసుల సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే పలువురిని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసుల దూకుడుతో పలువురు యూట్యూబ్‌ ఛానల్స్‌ నిర్వాహకులు అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. కాగా.. సీఎం ఫొటో మార్ఫింగ్‌, మహిళా ఐఏఎస్‌పై అసభ్యకర కథనాలపై తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి ఆదేశాల మేరకు 8 మంది సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ విసి.సజ్జనార్‌ పర్యవేక్షణలో ఈ బృందం పనిచేస్తోంది. దర్యాప్తు వేగంగా పూర్తి చేసి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. మరోవైపు మహిళా అధికారిపై అసభ్యకర కథనాలను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తీవ్రంగా ఖండిరచారు. అలాగే ఐఏఎస్‌, ఐపీఎస్‌ అసోసియేషన్లు కూడా ఈ వ్యవహారంపై సీరియస్‌ అయ్యాయి. ఇలాంటి వార్తలు అధికారుల మనోభావాలను దెబ్బతీస్తాయని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.
చట్టప్రకారం విలేకర్ల అరెస్ట్‌
:ఒక మహిళా ఐఏఎస్‌ అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఈ కేసులో విూడియా ప్రతినిధుల అరెస్టుపై సీపీ స్పందించారు. విూడియా ప్రతినిధులు విచారణకు సహకరించాలన్నారు. నిందితులు ఎక్కడున్నా పట్టుకొస్తాం. ఓ టీవీ ఛానెల్‌ సీఈవో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పిలిస్తే.. విచారణకు రావాలి కదా అంటూ.. రిపోర్టర్లు ఎందుకు పారిపోతున్నారని అన్నారు.అప్పటికప్పుడు ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ చేసుకుని బ్యాంకాక్‌ పారిపోయేందుకు ప్రయత్నిస్తేనే అదుపులోకి తీసుకున్నాం. మరో రిపోర్టర్‌ విచారణకు వస్తానని చెప్పి సెల్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నారు. అందుకే వారిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నాం.త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాం అంతా చట్ట ప్రకారమే చేస్తాం. చట్టం తనపని తాను చేసుకుపోతుందని సజ్జన్నార్‌ అన్నారు. ప్రజా జీవితంలో విమర్శలు సహజం. విమర్శలు సహేతుకంగా ఉండాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా మహిళా అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం క్రూరత్వమే అవుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు. మహిళా అధికారులపై అసత్య కథనాలు ప్రసారమైతే వాళ్లు సమాజంలో ఎలా పనిచేయగలుగుతారని నిలదీసారు. మహిళా అధికారులను కించపరుస్తూ వార్తలు ఎలా రాస్తారు. అందరూ ఆత్మ విమర్శ చేసుకోవాలి. సీఎంపై అవమానకర వార్తలు వేయడంతో మరో కేసు నమోదైంది. ఈ రెండు కేసులకు సంబంధించి సిట్‌ విచారణ జరుపుతోందని సీపీ తెలిపారు.
మహిళపై ఉద్దేశ్యపూర్వక దుష్ప్రచారం
తెలంగాణలో మహిళా ఐఏఎస్‌ అధికారిపై అసభ్యకర కథనాలు ప్రసారం ఘటన తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మహిళా ఐఏఎస్‌ అధికారిని కించపరిచిన కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ నేతృత్వంలో సిట్‌ నడువనుంది. ఇదిలా ఉండగా.. మహిళా అధికారిపై అసత్య కథనాలు ప్రసారం చేయడంపై సీపీ సజ్జనార్‌ సోషల్‌ విూడియా ఎక్స్‌ వేదికగా స్పందించారు. మహిళా అధికారులపై ఉద్దేశపూర్వక దుష్పచ్రారం ఆందోళనకరమని అన్నారు. ఇకపై మహిళలను అవమానిస్తే సహించేది లేదని సీపీ సజ్జనార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ’మహిళలపై విమర్శ కాదు.. దుష్పచ్రారం నేరం. ప్రజా జీవితంలో విమర్శలు సహజమే. కానీ మహిళలపై వ్యక్తిగత దాడులు, చరిత్ర హననం, అసభ్య వ్యాఖ్యలు విమర్శలు కావు.. అవి క్రూరత్వం. ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రైవేట్‌ ఉద్యోగి అయినా, గృహిణి అయినా మహిళ గౌరవం అపరిమితం. టీవీ చర్చలు, సోషల్‌ విూడియా పోస్టులు, వార్త కథనాల పేరుతో మహిళలపై దూషణలు అసహ్యకరం. నేడు ప్రతి పనిలో మహిళలు ముందువరుసలో నాయకత్వం వహిస్తున్నారు. పాలన, పోలీసు శాఖ, శాస్త్ర రంగం, విూడియా సహా ప్రజాజీవితంలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇల్లు`ఉద్యోగం రెండిరటినీ సమతుల్యం చేస్తున్నారు మహిళలు. కనిపించని బాధ్యతలతో కుటుంబాన్ని నడుపుతూ.. సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళలపై దాడులు ప్రగతిపై దాడులే.భారతీయ సంప్రదాయం చెబుతున్న సందేశం ప్రకారం ’యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ .. మహిళలకు గౌరవం ఉన్న చోటే సుభిక్షం ఉంటుంది. మహిళా అధికారులపై ఉద్దేశపూర్వక దుష్పచ్రారం ఆందోళనకరం. వ్యక్తిగతంగా దెబ్బతీయడం, ప్రతిష్ఠను నాశనం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మహిళలను గౌరవించని సమాజం భవిష్యత్తును కోల్పోతుంది. ముందుండి నడిపిస్తున్న మహిళలను కించపరచడం దేశానికే నష్టం. స్పష్టమైన సందేశం ఒక్కటే.. మహిళలపై అవమానం, వివక్ష, చరిత్ర హననం ఇక సహించబోము. ది ఫ్యూచర్‌ ఈజ్‌ ఫీమేల్‌.. ఆ భవిష్యత్తు గౌరవంతోనే నిర్మితమవుతుంది.. అవమానంతో కాదు’ అంటూ సీపీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు.

 

అర్థరాత్రి జర్నలిస్టుల అరెస్ట్‌ దారుణం
` రాష్ట్రంలో ఎమర్జెన్సీ తలపిస్తున్న కాంగ్రెస్‌ పాలన:కేటీఆర్‌
` పండగపూట కక్షసాధింపు చర్యలు తగవు: హరీశ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):సంక్రాంతి పండుగవేళ జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఖండిరచారు. తెలంగాణలో ఈ కాంగ్రెస్‌ పాలన అనుక్షణం ఎమర్జెన్సీని గుర్తుచేస్తోందని విమర్శించారు. తెలంగాణ డీజీపీ జర్నలిస్టులను నేరస్తులలా ట్రీట్‌ చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. విూరు ముందుగా వారికి నోటీసులు జారీచేసి విచారణకు పిలువాల్సిందని కేటీఆర్‌ అన్నారు. రాత్రిపూట జర్నలిస్టుల ఇళ్లపై దాడిచేసి సబబు కాదని తప్పుపట్టారు. అరెస్ట్‌ చేసిన జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని తాను డిమాండ్‌ చేస్తున్నానన్నారు. వారిపై ఏవిూ నాన్‌బెయిలబుల్‌ సెక్షన్‌ల కింద కేసులు నమోదు కాలేదని, అలాంటప్పుడు తెలంగాణ పోలీసులు జర్నలిస్టులను, వారి కుటుంబాలను ఎందుకు అర్ధరాత్రి అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రశ్నించారు.జర్నలిస్టులను వెంటనే విడుదల చేసి వారి విషయంలో చట్టపరంగా నడుచుకోవాలని తాను డీజీపీని కోరుతున్నానని కేటీఆర్‌ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి, ఆ పార్టీకి నీచ నాయకత్వానికి అనుగుణంగా మురికి రాజకీయాలు చేయవద్దని ఆయన సూచించారు. అసలు ఈ విషయాన్ని లీక్‌ చేసింది ఎవరు..? మిస్టర్‌ 30 పర్సెంట్‌ సపోర్టు లేకుండా ప్రభుత్వ అనుకూల టీవీ ఛానెల్‌ ఈ అంశాన్ని ప్రసారం చేసిందని విూరు భావిస్తున్నారా..? అని ప్రశ్నించారు.
రాజకీయ క్రీడలో భాగంగానే అరెస్టులు
ఎన్‌టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్ట్‌ ను ఖండిస్తున్నామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ రాజకీయ క్రీడలో భాగంగా నచ్చిన వారిని మంత్రులను చేయడానికి టీవీ చానెళ్లకు లీకులు ఇచ్చి ఉపయోగించుకొని మరల వారి విూదనే సిట్‌ వేసి అరెస్టులకు పాల్పడుతుందని ఆరోపించారు. అర్ధరాత్రి అక్రమంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లి అరెస్ట్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జరుగుతున్న పరిణామాలన్నీ డ్రామాలని యావత్‌ ప్రజలకు తెలుసనీ, ఎమర్జెన్సీని తలపించే విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. అరెస్ట్‌ చేసిన వారిని బేషరతుగా వెంటనే విడుదలచేయాలి డిమాండ్‌ చేశారు.కాగా, ఎన్టీవీ ఇన్‌ఫుట్‌ ఎడిటర్‌ దొంతు రమేశ్‌, రిపోర్టుర్లు పరిపూర్ణచారి, సుధీర్‌లను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబంతో విదేశాలకు వెళ్తుండగా దొంతు రమేశ్‌ను హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేయగా.. మరో ఇద్దరు రిపోర్టర్లను సైతం అదుపులోకి తీసుకున్నారు. మహిళా ఐఏఎస్‌, మంత్రి వార్త వ్యవహారంలో ఎన్టీవీ న్యూస్‌ ఛానల్‌పై చర్యలకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు జర్నలిస్టులను అరెస్టు చేశారు.
ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్‌ దుర్మార్గం
ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టును మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండిరచారు. పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు అని విమర్శించారు. విూ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా అని మండిపడ్డారు. ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్‌రావు అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి అని ఆరోపించారు. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవంపై పని గట్టుకొని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి అని అన్నారు. జర్నలిస్టుల అరెస్టులు, విూడియా` డిజిటల్‌ విూడియాపై సిట్లతో ఎవర్ని కాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు? అని ప్రశ్నించారు. విూ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి.. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా విూరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ? అని ప్రశ్నించారు. అరెస్ట్‌ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్టీవీ ఇన్‌ఫుట్‌ ఎడిటర్‌ దొంతు రమేశ్‌, రిపోర్టుర్లు పరిపూర్ణచారి, సుధీర్‌లను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబంతో విదేశాలకు వెళ్తుండగా దొంతు రమేశ్‌ను హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేయగా.. మరో ఇద్దరు రిపోర్టర్లను సైతం అదుపులోకి తీసుకున్నారు. మహిళా ఐఏఎస్‌, మంత్రి వార్త వ్యవహారంలో ఎన్టీవీ న్యూస్‌ ఛానల్‌పై చర్యలకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు జర్నలిస్టులను అరెస్టు చేశారు.

జర్నలిస్టులపై కాంగ్రెస్‌ సర్కార్‌ తీరు అనైతికం’
` కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): జర్నలిస్టులపై కాంగ్రెస్‌ సర్కారు తీరు అనైతికమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. నోటీసుల ఇవ్వకుండా అరెస్ట్‌ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.ఓ వార్తకు సంబంధించి ఎన్టీవీకి చెందిన పలువురు జర్నలిస్టులను తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. విచారణ చేయకుండా చర్యలు తీసుకోవడం సరికాదని, జర్నలిస్టులను బెదిరించి భయపెట్టి చర్యలకు పాల్పడకూడదన్నారు. అరెస్ట్‌ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేవారు కిషన్‌రెడ్డి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి జర్నలిస్టులను అరెస్ట్‌ చేయడం తగదన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్‌. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలన్నారు బండి సంజయ్‌ ఎన్టీవీకి చెందిన జర్నలిస్టులను అరెస్ట్‌ చేసే వ్యవహారంలో పోలీసుల తీరు సమర్థనీయం కాదన్నారు రాజకీయ విశ్లేషకులు కొమ్మినేని శ్రీనివాసరావు. సోదాల పేరుతో విూడియా సంస్థలన ఇబ్బంది పెట్టొద్దన్నారు కొమ్మినేని.జర్నలిస్టుల అరెస్ట్‌ను బీఆర్‌ఎస్‌ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఖండిరచారు. అర్థరాత్రి తలుపులు పగులగొట్టి జర్నలిస్టులన అరెస్ట్‌ చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ సర్కార చర్యలు ఎమెర్జెన్సీని తలపిస్తున్నాయని, అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు పల్లా.