ప్రపంచానికే సగర్వంగా నిలిచేలా..
` డావోస్‌లో తెలంగాణ నెక్స్ట్‌జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026`30 ప్రకటన
` 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో తెలంగాణను అభివృద్ది చేయడమే లక్ష్యం
` ఈ రంగంలో అత్యాధునిక విభాగాల్లో సామర్థ్యాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి
` గ్రీన్ ఫార్మా సిటీ, ఫ్లాగ్‌షిప్ ఫార్మా విలేజెస్ కార్యక్రమాలతో గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా తెలంగాణ స్థానం మరింత బలోపేతం
` జీనోమ్ వ్యాలీలో బయో వృద్ధి దశ సంస్థల కోసం తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న గ్రోత్`ఫేజ్ సెంటర్, బయోఫార్మా స్కేల్`అప్ తయారీ కేంద్రం
` వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ సెంటర్ హైదరాబాద్‌లో స్థాపితం
హైదరాబాద్(జనంసాక్షి):అధునాతన చికిత్సలు, డేటా ఆధారిత పరిశోధనలు, ప్రిసిషన్ మెడిసిన్, సస్టైనబిలిటీ వంటి అంశాల ఆధారంగా ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగం వేగంగా మార్పులు చెందుతున్న తరుణంలో, తెలంగాణ రాష్ట్రం పరిమాణానికి మాత్రమే కాకుండా విలువ, ఆవిష్కరణలు, గ్లోబల్ సమగ్రత ద్వారా నాయకత్వం వహించాలనే స్పష్టమైన, ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతోంది.తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026`2030ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో, ప్రపంచ పరిశ్రమ నాయకులు, సీనియర్ ప్రభుత్వాధి కారుల మధ్య దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో ఆవిష్కరించనున్నారు. ఈ విధానం రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో కీలక మలుపుగా నిలవనుంది. తెలంగాణకు ఉన్న బలమైన తయారీ రంగ పునాదులను మరింత సవిూకరించడంతో పాటు, అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి రంగంలో గ్లోబల్ స్థాయిలో పోటీ చేయగల కేంద్రంగా రూపాంతరం చెందేందుకు ఈ పాలసీ దిశానిర్దేశం చేస్తుంది.హైదరాబాద్ ఇప్పటికే ఇలీ లిల్లీ, సానోఫీ, ఎంఎస్‌డీ, నోవార్టిస్, ఆమెజాన్, బీఎంఎస్ వంటి అనేక ప్రముఖ గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీల కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. భారతదేశ ఔషధ ఉత్పత్తిలో సుమారు 40 శాతం వాటా కలిగిన తెలంగాణ… దశాబ్దాలుగా ఫార్మా తయారీ రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని సాధించి, ఆర్థిక శక్తి కేంద్రంగా, చురుకైన పారిశ్రామిక హబ్‌గా పేరు తెచ్చుకుంది. ఈ బలమైన పునాదిపై ఆధారపడి, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణను గ్లోబల్ వేదికపై ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల భవిష్యత్తును రూపకల్పన చేసే నాయకత్వ స్థానానికి తీసుకెళ్లాలనే దృష్టిని వ్యక్తం చేస్తున్నారు.ఫార్మాస్యూటికల్ తయారీ, ఆర్ అండ్ డీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా ప్రపంచ స్థాయి, సుస్థిర పారిశ్రామిక క్లస్టర్‌ను తెలంగాణ అభివృద్ధి చేస్తోంది. కొత్త పాలసీ ద్వారా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ను ప్రకటించనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా అంతర్జాతీయ విమానాశ్రయానికి సవిూపంలో ఉన్న ఈ గ్రీన్ ఫార్మా సిటీ, ఎదుగుతున్న ఏఐ హబ్‌తో సహా ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలకు అనుసంధానాన్ని కల్పిస్తుంది. జీరో లిక్విడ్ డిశ్చార్జ్, కేంద్రీకృత వ్యర్థాల నిర్వహణ, శక్తి సామర్థ్య వ్యవస్థలు వంటి పచ్చదనం చర్యలతో అధునాతన మౌలిక సదుపాయాలను సమన్వయం చేస్తూ, ‘‘వర్క్, లివ్, లెర్న్ అండ్ ప్లే’’ విధానంలో ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేయబడిరది.మొత్తంగా తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026`2030 గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ ఆవిష్కరణల తదుపరి అధ్యాయాన్ని రూపుదిద్దే దిశగా తెలంగాణ సంకల్పాన్ని స్పష్టంగా ప్రకటించే వ్యూహాత్మక ప్రకటనగా నిలుస్తుంది.?తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ ప్రధాన బలాలుతెలంగాణ ఆసియాలోని ప్రముఖ లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటి. రాష్ట్రంలో 2,000కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉండగా, వీటి సంయుక్త విలువ సుమారు 80 బిలియన్ డాలర్లు. భారతదేశ ఔషధ ఉత్పత్తిలో దాదాపు 40 శాతం వాటా కలిగిన తెలంగాణలో 250కి పైగా యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదిత తయారీ కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో మూడో వంతు వాటాను కలిగి ఉండటంతో, తెలంగాణకు ‘‘వాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’’ అనే గుర్తింపు లభించింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రగతిశీల విధానాలు, క్లస్టర్ ఆధారిత వ్యవస్థ, లోతైన ప్రతిభా వనరులతో హైదరాబాద్‌లో 20కి పైగా లైఫ్ సైన్సెస్, మెడ్‌టెక్ ఇంక్యూబేటర్లు పనిచేస్తూ, గ్లోబల్ స్థాయిలో పోటీగల, ఆవిష్కరణలతో నడిచే రంగంగా అభివృద్ధి చెందింది.ఈ అభివృద్ధి దృక్పథంలో భాగంగా తెలంగాణ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ వేదిక ప్రపంచ పరిశ్రమ నాయకులు, పెట్టుబడిదారులు, పరిశోధకులు, విధాన నిర్ణేతలను అనుసంధానించే ప్రధాన వేదికగా నిలుస్తోంది. ఇది రాష్ట్ర ఆవిష్కరణ ఎకో సిస్టమ్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తూ… ఉన్నత విలువ కలిగిన భాగస్వామ్యాలను ప్రోత్సహించి, 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ ఆర్థిక వ్యవస్థ నిర్మించాలనే తెలంగాణ లక్ష్యాన్ని వేగవంతం చేస్తోంది.



