తొలి తెలంగాణ శాసనసభ కొలువుదీరింది

pramanaswikaram
ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి
సభా నాయకుడు కేసీఆర్‌ ప్రమాణం
కొత్త సభ్యులతో ప్రాగంణం కళకళ
హైదరాబాద్‌, జూన్‌ 9 (జనంసాక్షి) :తెలంగాణ తొలి శాస నసభ కొలువుదీరింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ పదాన్ని పలక కూడదన్న అసెంబ్లీలో తెలంగాన ముఖ్యమంత్రిగా ప్రవేశించిన కేసీఆర్‌ తొలుత ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విడిపోవడంతో కొత్తగా ఏర్పడ్డ శాసనసభ సమావేశం కొంగ్రొత్తగా దర్శనమిం చ్చింది. గతంలో సభ్యులుగా ఉన్న సీమాంధ్రకు చెందిన వారెవరూ ఇందులో సభ్యులు కాకపోవడం విశేషం. అలాగే చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి వారు కూడా లేకుండా జరిగిన తొలి తెలంగాణ అసెంబ్లీ సమావేవౄలు ఇవి. తెలంగాణపై వ్యతిరేకంగా మాట్లాడిన వారంతా మట్టి కరుచుకుపోయారని చెప్పడానికి అన్న ట్లుగా తెలంగాణ అసెంబ్లీ అంతా బోసిగా కనిపించింది. 294 మందికి అవసరమైనట్లుగా ఉన్న సీటింగ్‌ కెపాసిటీ కేవలం 119 మందికే పరియమితమయ్యింది. ఎందరో కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికై వచ్చారు. మరెందరో పాత సభ్యులు కూడా కొత్తగా ప్రవేశిం చారు. మొన్నటి వరకు మంత్రులుగా ఉన్న వారు విపక్షంలో కూ ర్చుండి పోయారు. ఇక కేసీఆర్‌తో పాటు మంత్రులు, నూతనంగా ఎన్నికైన వారు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకా రం చేశారు. ప్రొటెం స్పీకర్‌ జానారెడ్డి వీరం దరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పదేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్‌ శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. టీడీపీ హయాంలో 2001లో డెప్యూటీ స్పీకర్‌ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్‌ తరవాత సిద్దిపేట నుంచి ఉప ఎన్నికల్లో గెలిచి వచ్చారు. ఆ తరవాత ఆయన ఎంపీగా వెళల్డంతో దాదాపు 12 ఏళ్లు అసెంబ్లీ మొహం చూడలేదు. ఇప్పుడు ఏకంగా సిఎంగా ప్రత్యక్షమవడం చారిత్రక ఘట్టంగా భావించాలి. అంత కుముందు తన కార్యాలయంలో పూజ చేసిన కేసీఆర్‌ ఎప్పటిలాగే తన కుడి చేతికి దట్టీ కట్టుకుని కనిపించారు. ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌ను ప్రొటెం స్పీకర్‌ కె. జానారెడ్డి అభినందించారు. కేసీఆర్‌ తర్వాత ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ టి. రాజయ్య, మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మిగతా సభ్యులు ప్రమాణం చేస్తున్నారు. సభ్యుల ప్రమాణస్వీకారం అనం తరం ఫ్లోర్‌ లీడర్లతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. స్పీకర్‌ ఏకగ్రీవ ఎన్నికపై చర్చించనున్నారు. ఫ్లోర్‌ లీడర్ల సహకారాన్ని కేసీఆర్‌ కోరనున్నారు. సభ్యుల ప్రమాణం తర్వాత స్పీకర్‌ పదవికి టీఆర్‌ఎస్‌ ఎమ్మల్యే మధుసూదనాచారి నామినేషన్‌ దాఖలు చేశారు. ఇక అమ రవీరులకు సంతాపం తెలుపుతూ సభ తీర్మానం చేసింది. శాసన సభ తొలి సమావేశాలు 11 గంటలకు ప్రారంభమయ్యాయి. కొత్త శాసనసభ సమావేశాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలందరూ ఉత్సా హంగా హాజరయ్యారు. మంత్రులు, సభ్యులతో జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ శాసనసభ తొలిసమావేశాలు ప్రారంభం కావడంతో తెరాస ఎమ్మెల్యేలు అమరవీరులకు నివాళులర్పించారు. సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్లే ముందు గన్‌ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద తెరాస ఎమ్మెల్యేలందరూ నివాళులర్పించి అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. ప్ర మాణాల అనంతరం అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది. అంతకుముందు రాజ్‌భవన్‌లో తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా కుందూరు జానారెడ్డి
ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్‌ దర్బార్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా నేతి విద్యాసాగర్‌ ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మంగళవారం శాసనసభ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. 11వ తేదీన 11 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక స్పీకర్‌గా మధుసూధనాచారి ఎన్నిక లాంఛనమే కానుంది. మొత్తానికి కొత్త రాష్ట్రం కొంగొత్త ఆశలు ఆకాంక్షల నడుమ తెలంగాణ తొలి శాసనసభ సోమవారం కొలువు దీరింది. అవిభక్త ఆంధప్రదేశ్‌ నుంచి విడిపోయాక జరుగుతున్న మొట్టమొదటి సమావేశాలు ఉద్విగ్న, ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభం అయ్యాయి. ఎలాంటి హడావిడి, ఎలాంటి ఉద్రికత్తలు లేకుండా మొదలైన సమావేవౄలకు ప్రస్తుత శాసనసభా మందిరం వేదికయ్యింది. నాలుగు రోజుల పాటు జరిగే సమావేశాల్లో తొలిరోజు సభ్యుల ప్రమాణ స్వీకారాలు జరిగాయి. రెండో రోజు స్పీకర్‌ ఎన్నిక, ఆ తర్వాత రోజు గవర్నర్‌ ప్రసంగం, చివరి రోజు ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటాయి. చివరి రెండు రోజుల్లో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా తెలంగాణలోని ప్రజాసమస్యలు ప్రస్తావనకు రానున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్‌ సుదీర్ఘంగా వివరణలతో కూడిన సమాధానం ఇవ్వనున్నారు. గవర్నర్‌ ప్రసంగంలో తెరాస తమ ప్రభుత్వ విధానాలు, హామీల అమలు తీరు ఇతర అంశాలను ప్రస్తావించనుంది. రైతు రుణమాఫీపై ఇప్పటికే ప్రభుత్వం తమ విధానాన్ని ప్రకటించింది. ఎన్నికల్లో తెరాసకు అధికారం దక్కగా, కాంగ్రెస్‌ ప్రతిపక్ష ¬దా పొందింది. టీడీపీ మూడో స్థానంలో నిలిచింది. మొత్తంగా ఎనిమిది పార్టీలకు సభలో ప్రాతినిద్యం దక్కింది. రాష్ట్ర విభజన దృష్ట్యా మండలిలోనూ సభ్యులంతా తెలంగాణ సభ్యులుగా ప్రమాణం చేసారు. గవర్నర్‌ ప్రసంగంపై ఆసక్తి ప్రభుత్వ హామీలపై సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో ఈ నెల 11న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ చేయనున్న ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. రుణమాఫీపై గవర్నర్‌ ప్రసంగంలో పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో మంత్రివర్గం ఏర్పాటు కాకపోవడం, ఎమ్మెల్యేలలో అధికశాతం కొత్తవారే కావడంతో సీనియర్‌ ఎమ్మెల్యేలపైనే మొత్తం సభా నిర్వహణ భారం పడనుంది.జూబ్లీహాలులో తెలంగాణ శాసనమండలి తొలి సమావేశాలు మూడు రోజుల పాటు సాగనున్నాయి. ప్రమాణస్వీకారంతో పాటు గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చతో ముగుస్తాయి.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా మధుసూదనాచారి
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా భూపాలపల్లి ఎమ్మెల్యే మధుసూదనాచారి ఎన్నిక ఇక లాంఛనమే కానుంది. ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో స్పీకర్‌గా ఎన్నికైనట్లు మంగళవారం ప్రకటిస్తారు. ఆ తరవాత ప్రోటెం స్పీకర్‌ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. తరవాత స్పీకర్‌ను అభినందిస్తూ తీర్మానం చేస్తారు. ఉదయం శాసనసభ ప్రారంభం కావడంతో స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అయింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మధుసూధానాచారి ఒక్కరే స్పీకర్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. మధుసూదనాచారికి అన్ని పార్టీలు మద్దతు తెలిపినట్లు సమాచారం. దీంతో స్పీకర్‌గా మధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికవడం లాంఛనమే. స్పీకర్‌ ఎన్నికపై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడుతుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ కాగా సాయంత్రం 5 గంటల వరకు స్పీకర్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఇచ్చారు. అయితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తరపున మధుసూదనాచారి ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేసారు. మధుసూదనాచారి ఏకగ్రీవం కోసం అన్ని పార్టీలను టీఆర్‌ఎస్‌ నేతలు సంప్రదించారు. దీంతో మధుసూదనాచారి స్పీకర్‌ పదవికి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. వరంగల్‌ జిల్లా భూపాల్‌పల్లి నుంచి మొన్నటి ఎన్నికల్లో గెలుపొందిన చారి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ వెన్నంటి ఉన్నారు. అదే ఆయనకు ఇప్పుడు కలిసి వచ్చింది. తెలంగాణ తొలి శాసనసభాపతిగా భూపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారిను ప్రభుత్వం ఖరారు చేసింది. శాసనసభలో మెజారిటీ దృష్ట్యా ఆయనకు పదవి దక్కడం ఖాయం. ఓటింగ్‌ వరకు వెళ్లకుండా ప్రభుత్వం అన్ని పార్టీల నేతలతో చర్చలు జరిపి ఎంపికను ఏకగ్రీవం చేయాలని భావిస్తోంది. ఇతర పార్టీలు కూడా సుముఖత వ్యక్తం చేయడంతో సభాపతి ఏకగ్రీవం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

తాజావార్తలు