దంతూరు మాజీ ఉపసర్పంచ్ బోదాసు శ్రీనివాస్ మృతి

భూదాన్ పోచంపల్లి, మార్చి 9(జనం సాక్షి ): మండలంలోని దంతూరు గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ బోదాసు శ్రీనివాస్ (47) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద ఉండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతి చెందారు. మృతుడికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ నెల 17న కుమార్తె నిశ్చితార్థం జరపడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి