పిలిచారు.. అగౌరవపరిచారు..
ఆర్మూర్,మార్చి 9(జనం సాక్షి):ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలోని రైతు వేదికలో ప్రజా ప్రతినిధులకు అవమానం. సోమవారం పట్టణంలోని రైతు వేదికలో నియోజకవర్గ వ్యాప్తంగా రంజాన్ తోఫా,కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ప్రజా ప్రతినిధులకు అధికారులు ప్రోటోకాల్ లో భాగంగా అందరినీ ఆహ్వానించారు. అధికారులు ప్రోటోకాల్ పాటించలేదంటూ ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. ఆహ్వానించడం మేరకు బాగానే ఉన్నా అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో వచ్చిన ప్రజాప్రతినిధులు వెనుతిరిగారు.మరికొందరు ప్రజా ప్రతినిధులు సర్పంచులు,
కౌన్సిలర్లు అసంతృప్తి చెంది రైతు వేదిక బయట బైఠాయించి కూర్చున్నారు.అధికారిక కార్యక్రమానికి పిలిచి.. అగౌరవపరిచేలా సరైన ఏర్పాట్లు చేయకపోవడం ఏంటని వారు అధికారుల సృష్టికి తీసుకువచ్చారు.



