పొరుగు దేశాలకు ఇరాన్ లొంగిపోయింది

` అందుకే దాడుల చేయమని పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పింది
` పశ్చిమాసియాను ఆ దేశం ఇక బెదిరించలేదు
` అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడుల వల్లే ఇది సాధ్యమైంది:ట్రంప్
` ఇరాన్‌పై అతిపెద్ద దాడి: అమెరికా మంత్రి స్కాట్ బెసెంట్
` ఇరాన్ యుద్ధనౌక నుంచి ప్రాణాలతో బయటపడినవారిని స్వదేశానికి పంపొద్దు
` శ్రీలంకపై అమెరికా ఒత్తిడి
వాషింగ్టన్(జనంసాక్షి):దాడుల విషయంలో గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పిన వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిం చారు. పశ్చిమాసియాలో ఓటమి పాలైన దేశంగా ఇరాన్‌ను పేర్కొన్నారు. ఆ దేశం దాని పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పి లొంగిపోయిందన్నారు. ఇకపై దాడులు చేయబోమని కూడా హావిÖ ఇచ్చిందని గుర్తుచేస్తూ.. అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడుల వల్లే ఇది సాధ్యమైందన్నారు. పశ్చిమాసియాను ఇరాన్ ఇక బెదిరించలేదని ‘ట్రూత్ సోషల’ వేదికగా పోస్టు పెట్టారు.“పశ్చిమాసియాను గుప్పిట్లో పెట్టుకుని, పాలించాలని ఇరాన్ చూసింది. కానీ, ఓటమి పాలైంది. ఆ దేశం లొంగిపోవడమో, లేదా కుప్పకూలిపోవడమో జరిగేవరకు.. దశాబ్దాలపాటు పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. ఈ రోజు ఇరాన్‌పై భీకర దాడులు జరగనున్నాయి. ఆ దేశ దుష్ప్రవర్తన కారణంగా.. అక్కడి ప్రాంతాలను సర్వనాశనం చేసే అంశం కూడా పరిశీలనలో ఉంది” అని ట్రంప్ హెచ్చరించారు.ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఇరాన్ ప్రతిదాడులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అమెరికా స్థావరాలపై దాడుల పేరిట పశ్చిమాసియా దేశాలపై పెద్దఎత్తున క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పారు. ఈ దేశాలపై ఇకపై దాడులు చేయబోమన్నారు. అయితే, అవి తమపై ప్రత్యక్ష దాడికి దిగితే మాత్రం.. స్పందించే హక్కు ఉందని స్పష్టం చేశారు.
నేడు ఇరాన్‌పై అతిపెద్ద దాడి: అమెరికా మంత్రి
అమెరికా` ఇజ్రాయెల్, ఇరాన్ దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై ఇప్పటి వరకు చేసిన దాడులకంటే అతిపెద్ద దాడి చేయడానికి తమ సైన్యం సిద్ధమైందన్నారు. ఎన్నో ఏళ్లుగా టెహ్రాన్ అభివద్ది చేస్తోన్న క్షిపణి తయారీ ఫ్యాక్టరీలు, క్షిపణి లాంచర్లను ఈ రోజు పూర్తిగా తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. తాము చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్‌గా ఇది చరిత్రలో నిలుస్తుందన్నారు. అమెరికా విÖడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెసెంట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పినట్లుగానే టెహ్రాన్ సహా ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి భారీ దాడులు జరుగుతుండటం గమనార్హం.యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే అమెరికా రెండు యుద్ధ విమాన వాహక నౌకలను ఇరాన్ వైపు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా మరో వాహక నౌక యూఎసఎస్ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్.. అట్లాంటిక్‌ను దాటి తూర్పు మధ్య ధరా సముద్రం వైపు కదిలినట్లు అంతర్జాతీయ విÖడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే కరేబియన్ సముద్రంలో మోహరించి ఉన్న అమెరికా యుద్ధ విమాన వాహక నౌక యూఎసఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ తాజాగా ఎర్ర సముద్రం వైపు కదిలినట్లు తెలుస్తోంది.
ప్రాణాలతో బయటపడినవారిని స్వదేశానికి పంపొద్దు: శ్రీలంకపై అమెరికా ఒత్తిడి
ఇరాన్‌కు చెందిన ఐరిస్ దేనా`75 యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామితో దాడి చేసి ముంచేసిన సంగతి తెలిసిందే. ఆ నౌకలో కొంతమంది సిబ్బందిని శ్రీలంక భద్రతాదళాలు రక్షించాయి. అలా ప్రాణాలతో బయటపడిన వారిని ఇరాన్‌కు తిరిగి పంపొద్దంటూ శ్రీలంక ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు శ్రీలంక కస్టడీలోని ఇరాన్ రెండో యుద్ధనౌకలోని సిబ్బందిని కూడా స్వదేశానికి పంపించొద్దంటూ అగ్రరాజ్యం అడిగినట్లు సమాచారం. ఈమేరకు అగ్రరాజ్య విదేశాంగ అధికారులను ఉటంకిస్తూ పలు ఆంగ్ల విÖడియా కథనాలు పేర్కొన్నాయి.అమెరికా దాడి చేసిన సమయంలో ఐరిస్ దేనా`75 యుద్ధనౌకలో 180 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 32 మందిని శ్రీలంక దళాలు రక్షించాయి. ఇక, ఇంజిన్ వైఫల్యం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఇరాన్ మరో నౌక ‘ఐరిన్స్ బుషెహర’ నుంచి 204 మంది నావికులను శ్రీలంక నౌకాదళం గురువారం సురక్షితంగా కొలంబోకు తరలించింది. వీరందరూ ప్రస్తుతం శ్రీలంక రక్షణలో ఉన్నారు. వీరిని ఇరాన్‌కు తిరిగి పంపిస్తే.. అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా టెహ్రాన్ ప్రచారం చేసుకునే అవకాశం ఉందని యూఎస్ అనుమానిస్తోంది. ఆ ప్రచారాన్ని అడ్డుకునేందుకు శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి అటు అమెరికా నుంచి గానీ.. శ్రీలంక నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

 

ఇరాన్‌ను లొంగదీసుకోవాలన్న కలలను సమాధి చేసుకోవాల్సిందే
` ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ అధ్యక్షుడు కౌంటర్
` గల్ఫ్ దేశాలపై ఇకపై ఎలాంటి దాడులు జరగబోవు
` ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకూడదనే ఈ నిర్ణయం
` వారిపై దాడులు చేయడం మా ఉద్దేశం కాదు
` పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పిన మసౌద్ పెజెష్కియాన్
` ఖమేనీ నలుగురు కుమారులు క్షేమం
` ఆన్‌లైన్‌లో ఫోటోలు విడుదల
` ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ సాయం!
టెహ్రాన్(జనంసాక్షి):అమెరికా` ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పారు. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన ఓ వీడియోలో మాట్లాడారు.ఈ సందర్భంగా గల్ఫ్ దేశాలపై ఇకపై ఎలాంటి దాడులు జరగబోవని పెజెష్కియాన్ ప్రకటించారు. అయితే, పొరుగు దేశాలు తమపై ప్రత్యక్ష దాడికి దిగితే మాత్రం.. స్పందించే హక్కు తమకు ఉందన్నారు. ఈ మేరకు దేశ తాత్కాలిక నాయకత్వ మండలి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల తాము దాడులు చేసిన దేశాలకు క్షమాపణలు కూడా చెప్పారు. వాటిపై దాడులు చేయడం తమ ఉద్దేశం కాదన్నారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, పెజెష్కియాన్ దీన్ని తోసిపుచ్చారు. ఇరాన్‌ను లొంగదీసుకోవాలన్న కలలను వారు సమాధి చేసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.
ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ సాయం!
పశ్చిమాసియాలో యుద్ధ సవిÖకరణాలు మారిపోతున్నాయి. ఇరాన్‌కు రష్యా వ్యూహాత్మక మద్దతు ఇస్తోందని తాజాగా ఓ నివేదిక పేర్కొంది. అమెరికా యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, సైనిక స్థావరాల గురించి ఇరాన్‌కు రష్యా ‘రియల్ టైమ్ ఇంటెలిజెన్స’ సహకారం అందిస్తోందని తెలిపింది. యుద్ధం తీవ్రమవుతున్న వేళ, అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఇది దోహదపడుతోంది. ఓ ప్రముఖ అమెరికన్ పత్రిక కథనం ప్రకారం.. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా యుద్ధనౌకలు, విమానాలు, ఇతర సైనిక స్థావరాల సమాచారాన్ని ఇరాన్‌కు రష్యా చేరవేసిందని ముగ్గురు అధికారులు వెల్లడించారు.యుద్ధం ప్రారంభంలోనే ఇరాన్.. అమెరికా దళాలను కనిపెట్టే శక్తిని చాలావరకు కోల్పోయింది. అయినా అగ్రరాజ్య సైనిక లక్ష్యాలపై దాడులు చేయగలుగుతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ వేల సంఖ్యలో వన్`వే ఎటాక్ డ్రోన్లను, వందల క్షిపణులను అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలు, ఇతర లక్ష్యాలపై ప్రయోగించింది. అమెరికా కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలనూ దెబ్బతీస్తోంది. రష్యాకు చెందిన అధునాతన ఉపగ్రహ సేవలు ఇరాన్‌కు లభిస్తున్నాయని, అందుకే దాని లక్షిత దాడుల సామర్థ్యం పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ వద్ద పరిమిత సంఖ్యలోనే సైనిక ఉపగ్రహాలు ఉన్నాయి. అందువల్ల రష్యా అందించే శాటిలైట్ చిత్రాలు వారికి ఉపయోగడుతున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా, తన నిఘా, టార్గెటింగ్ సామర్థ్యాలను బాగా మెరుగుపరుచుకుంది. దాని ఫలితంగా ఇప్పుడు ఇరాన్ తన ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకొని దాడులు చేయగలుగుతోంది. ఇరాన్‌కు రష్యా సహకారం అందిస్తోందనే కథనాలపై స్పందించడానికి అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ, రక్షణ శాఖ నిరాకరించాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్, చైనా, ఉత్తర కొరియాలు రష్యాకు వివిధ రూపాల్లో సైనిక సహకారాన్ని అందించాయి. మరోవైపు అమెరికా నేరుగా ఉక్రెయిన్‌కు ఆయుధాలతోపాటు, ఇంటెలిజెన్స్ సహకారం అందించింది. ఉక్రెయిన్ నగరాలపై దాడికి రష్యా ఉపయోగిస్తున్న డ్రోన్‌లను ఇరాన్ సరఫరా చేసింది. అందుకే రష్యా ఇప్పుడు ఇరాన్‌కు ఇంటెలిజెన్స్ సహకారం అందిస్తోంది. అయినప్పటికీ పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ భీకర యుద్ధంలో రష్యా నేరుగా ప్రవేశించే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ దేశానికి ఉక్రెయినే మొదటి ప్రాధాన్యమని చెబుతున్నారు.
ఖమేనీ నలుగురు కుమారులు క్షేమం
ఇజ్రాయెల్ తొలి దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లి అలీ ఖమేనీ మతి తీవ్ర సంచలనమైంది. దీంతో మధ్యప్రాచ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీపాటు ఆయన కొడుకుల్లో ఒకరు మతి చెందినట్టు తొలి వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన కుమారులు నలుగురు క్షేమంగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఖమేనీ మరణించినప్పటికీ ఆయన నలుగురు కొడుకులైన ముస్తాఫ్ ఖమేనీ, మొజ్తబా ఖమేనీ, మసూదు ఖమేనీ, మెయిసమ్ ఖమేనీలు సురక్షిత ప్రాంతంలో ఉన్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. వారి ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఖమేనీ మతి తర్వాత సుప్రీం లీడర్ ఎంపిక కోసం అన్వేషణ జరుగుతున్న తరుణంలో ఫోటోలు విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఖమేనీ తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్ప్పుడూ రహస్యంగా ఉంచేవారు. అరుదుగా మాత్రమే ఆయన తన భార్య, కుమారులతో కనిపించే వారు. క్రియాశీలక రాజకీయాలకు కుమారులను దూరంగా ఉంచేవారు. ఆయన కుటుంబంలోని ఒకరిద్దరు మాత్రమే రాజకీయాల్లో ప్రభావం కనబరచే వారని చెబుతుంటారు. ఖమేనీ భార్య మన్సూరే భోజస్తే బాఘెర్జాదే ఎప్ప్పుడూ ప్రచారానికి దూరంగానే ఉండేవారు. ఇరాన్‌లోని ఓ ప్రముఖ వ్యాపారి కుటుంబంలో 1947లో ఆమె జన్మించారు. 1964 ఖొమేనీని వివాహమాడారు. ఇరాన్‌లోని తలెత్తిన ఇస్లామిక్ విప్లపంతో సహా ఇరాన్ రాజకీయ చరిత్రలో సంక్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పడల్లా ఖమేనీకి ఆమె బాసటగా నిలిచారు. ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడల్లో ఖమేనీ మరణించడంలో ఆయన కుటుంబం భవిష్యత్తు, ప్రతీకార చర్యలకు దిగే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఖమేనీ స్థానంలో ఎవరు వచ్చినా వాళ్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ ప్రభుత్వం నియమించిన ఏ నాయకుడినైనా నిస్సందేహంగా అంతం చేస్తామని హెచ్చరించారు. ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టేది లేదన్నారు. ఈ క్రమంలోనే ఖమేనీ రెండో కుమారుడు మజ్తబాను తమ సుప్రీం నేతగా ఇరాన్ అసెంబ్లీలోని కీలక నేతలు ఎన్నుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అమెరికా బలగాల కోసం వేచిచూస్తున్నాం
` హర్మూజ్ జలసంధి వద్ద రక్షణకల్పిస్తామన్న అమెరికా వ్యాఖ్యలపై ఐఆర్‌జీసీ కౌంటర్
` ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ సాయం!
టెహ్రాన్(జనంసాక్షి):అమెరికాకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ గట్టి హెచ్చరికలు చేసింది. చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద యూఎస్ దళాలను ఎదుర్కొనేందుకు వేచిచూస్తున్నట్లు పేర్కొంది. జలసంధి విÖదుగా చమురు నౌకలకు రక్షణగా వెళ్లేందుకు తమ దళాలు సిద్ధమవుతున్నాయని అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ ప్రకటించారు. దీనికి స్పందిస్తూ ఐఆర్‌జీసీ ఈ హెచ్చరికలు చేసింది.ఐఆర్‌జీసీ ప్రతినిధి అలీ మహ్మద్ నైని విÖడియాతో మాట్లాడుతూ.. అగ్రరాజ్యం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు.. 1987లో సూపర్ ట్యాంకర్ బ్రిడ్జ్‌టన్‌కు జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. దీంతో పాటు ఇటీవల ఆ దేశ చమురు ట్యాంకర్లను కూడా తాము లక్ష్యంగా చేసుకున్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. 1987లో కువైట్‌కు చెందిన బ్రిడ్జ్‌టన్ ట్యాంకర్ పర్షియన్ గల్ఫ్ విÖదుగా వెళ్తుండగా.. నాటి ఉద్రిక్తతల దష్ట్యా యూఎస్ నౌకాదళం ఆ నౌకకు రక్షణ కల్పించింది. అయితే, నాడు ఆ నౌకను ఐఆర్‌జీసీ లక్ష్యంగా చేసుకుంది. ఫార్సీ దీవుల సవిÖపంలో నౌక వెళ్లే మార్గంలో నీటి అడుగున పేలుడు పదార్థాలను ఉంచి దాడి చేసింది. ఈ ఘటనలో నౌక దెబ్బతిన్నప్పటికీ.. తన ప్రయాణాన్ని కొనసాగించి గమ్యస్థానాన్ని చేరుకుంది.ఇక, పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. అమెరికా` ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇటీవల ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ క్రమంలో జలసంధి విÖదుగా చమురు రవాణాకు అంతరాయం లేకుండా చూసుకునేందుకు అవసరమైతే తమ నౌకాదళంతో వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు.

 

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
` 41 మంది మతి
టెల్ అవీవ్(జనంసాక్షి):పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్`అమెరికా దళాల యుద్ధం ఎనిమిదో రోజుకు చేరింది. శనివారం తెల్లవారుజూమున ఇజ్రాయెల్ విస్తత దాడులను చేపట్టింది. ఇరాన్ లెబనాన్ రాజధానులపై కూడా బాంబు దాడులను ప్రారంభించింది.