నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే దొంతి

చెన్నారావుపేట, మార్చి 8 ( జనం సాక్షి): నూతన వధూవరులను నర్సంపేట ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డిఆశీర్వదించారు.మండలంలోని లింగగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బూడిద చిన్న వెంకన్న కూతురు, కొనాపురం గ్రామానికి చెందిన మండల శోభ- సుధాకర్ దంపతుల కూతురు అనూష-నవీన్ ల వివాహ మహోత్సవ వేడుకకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్మండల అధ్యక్షులు సిద్దన రమేష్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పెట రమేష్, మండల ప్రధాన కార్యదర్శి ఆవుల రాములు, మాధారపు చరణ్, ఆయా గ్రామాల సర్పంచులు మైదం రాకేష్, కంది శ్వేత క్రిష్ణ చైతన్య రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు, ఉప సర్పంచ్ బండి హరీష్, కోనాపురం ఉప సర్పంచ్ మండల నర్సింహ రాములు, కాంగ్రెస్ అధ్యక్షులు కళ్లెపు రాజశేఖర్, మంద సోములు, చీకటి చిన్న రాజు, బూడిద కుమారస్వామి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.