30 నెలలలో పాలమూరు`రంగారెడ్డి పూర్తి చేస్తాం
` ప్రాజెక్టుల భూ సేకరణ కోసం రూ.5 వేల కోట్లు
` 2027 మార్చి నాటికి కల్వకుర్తి,నెట్టెంపాడు, భీమా,కోయిల్ పూర్తి
` మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):30నెలల వ్యవధిలో పాలమూరు `రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.అదే విదంగా 2027 మార్చి మాసంతానికి కల్వకుర్తి,నెట్టెంపాడు ,భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి సమద్ధిగా సాగు నీరు,త్రాగు నీరు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.మహబూబ్నగర్ జిల్లాతో సహా దక్షిణ తెలంగాణా ప్రాంత రైతాంగానికి సరిపడా సాగు నీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని ఆయన చెప్పారు.మహబూబ్నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై ఆదివారం రోజున సహచర మంత్రులు జూపల్లి కష్ణారావు, వాకిటి శ్రీహరి జిల్లా కు చెందిన ప్రజాప్రతినిధులతో కలసి ఆయన ప్రత్యేక సవిÖక్ష సమావేశం నిర్వహించారునీటిపారుదల శాఖా సలహాదారు ఆదిత్యా దాస్ నాధ్,ప్రధాన కార్యదర్శి ఈ. శ్రీధర్,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్ తో సహా నీటిపారుదల శాఖా ఇంజినీరింగ్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిర్మాణంలో ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని కల్వకుర్తి ప్రాజెక్టుకు 909 కోట్లు,నెట్టేంపాడు కు 252 కోట్లు,భీమా ప్రాజెక్టుకు 200 కోట్లు,కోయిలసాగర్ ప్రాజెక్టుకు 185 కోట్లు కేటాయింపులు జరిగాయాని ఆయన వివరించారు.అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, పునరావాస పనులకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భూసేకరణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ జూన్ 2 నాటికి 5000 కోట్లు విడుదల చెయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.2014 లో బి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురైయ్యయని ఆయన విమర్శించారు.పాలమూరు? రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో ఆఫ్‌టేక్ పాయింట్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల లిఫ్ట్ ఖర్చులు పెరిగి రాష్టానికి నష్టం కలిగిందని అన్నారు. ఇదే తరహాలో కాలేశ్వరం లిఫ్ట్ ఎత్తిపోతల పధకాన్ని తుమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం తెలంగాణ రైతులకు అన్యాయం జరిగేలా చేసిందని ఆయన పేర్కొన్నారు.రైతులకు వాగ్దానం చేసిన సాగునీటి ప్రయోజనాలను అందించడానికి ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపారు. అన్ని చర్యలు చట్టబద్ధంగా, పారదర్శకంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కష్ణా పరివాహక ప్రాంతంలోని రైతులకు విశ్వసనీయ నీటి సరఫరా, అధిక దిగుబడులు, ప్రత్యక్ష ఆర్థిక మద్దతు అందిస్తామని ఆయన హావిÖ ఇచ్చారు.సాగు ప్రాజెక్టులపై బీఆరఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించిన మంత్రి, వారి ఆరోపణలను గోబెల్స్ శైలిలోని అబద్ధ ప్రచారంగా అభివర్ణించారు. పాలమూరు?రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు బీఆరఎస్ ప్రభుత్వం రూ.35,200 కోట్ల పరిపాలన అనుమతి తీసుకున్నప్పటికీ, సుమారు రూ.27,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి పనులను నిర్లక్ష్యంగా వదిలేసిందని విమర్శించారు.2023 సెప్టెంబర్‌లో ఈ ప్రాజెక్టులో ఒక పంపును కేవలం ఒక గంట మాత్రమే నడిపి, ఒక్క ఎకరానికి కూడా సమర్థంగా నీరు అందించలేకపోయారన్నారు. ప్రస్తుతం సవరించిన అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.55,000 కోట్లుగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. డిస్టిబ్యూటరీ నెట్‌వర్క్ నిర్మాణ వ్యయం కలిపితే మొత్తం వ్యయం రూ.80,000 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అయినప్పటికీ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటివరకు పాలమూరు?రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌పై రూ.7161 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో ప్రాజెక్టు పనులకు రూ.6718 కోట్లు, భూసేకరణకు రూ.284.71 కోట్లు, పునరావాసానికి రూ.63.65 కోట్లు, ఇతర ఖర్చులకు రూ.94 కోట్లు వినియోగించినట్లు వెల్లడించారు.జూరాల ప్రాజెక్టు డీసిల్టింగ్‌జూరాల (ప్రియదర్శిని జూరాల) ప్రాజెక్టులో వెంటనే డీసిల్టింగ్ పనులు ప్రారంభించాలని మంత్రి నీటిపారుదల అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన సమయంలో దాని స్థూల నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలుగా ఉండగా, మట్టిపొరలు పేరుకుపోవడం వల్ల ప్రస్తుతం ప్రభావవంతమైన సామర్థ్యం సుమారు 9 టీఎంసీలకు తగ్గిందని తెలిపారు. 1995లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో గత మూడు దశాబ్దాలుగా సహజంగా పేరుకుపోయిన మట్టి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.ప్రాజెక్టు నుంచి తవ్వి తీసే ఇసుకను గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టు పనులకు ఉపయోగించే అవకాశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు.తెలంగాణకు కష్ణా నదిపై ఉన్న హక్కులను పూర్తిగా వినియోగించుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కష్ణా పరివాహక ప్రాంతంలో వ్యవసాయరంగంలో రికార్డు స్థాయి పురోగతి సాధించామని తెలిపారు. గత ఖరీఫ్ సీజన్‌లో 148.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి నమోదు కాగా, కనీస మద్దతు ధర కొనుగోలు ద్వారా సుమారు 72 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో సుమారు రూ.20,000 కోట్లు జమ చేసినట్లు వివరించారు.



