చెన్నారావుపేట ఇన్చార్జి ఎంపీడీవోగా ఆయేషా పర్వీన్

చెన్నారావుపేట, మార్చి 8 ( జనం సాక్షి): చెన్నారావుపేట ఇన్చార్జి ఎంపీడీవోగా మండల ప్రజా పరిషత్ సూపరిండెంట్ ఆయేషా పర్వీన్ కు బాధ్యతలను అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ సత్య శారద ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నారావుపేట ఎంపీడీవో గా పని చేస్తున్న వెంకట శివానంద్ మర్రి చెన్నారెడ్డి ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్ లో 45 రోజులపాటు శిక్షణ తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో సూపరిండెంట్ ఆయేషా పర్వీన్ కు ఇన్చార్జి ఎంపిడిఓ బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఆయేషా అపర్వీన్ సోమవారం ఎంపీడీవోగా బాధ్యతలను చేపట్టనున్నారు.