ఇరాన్ బస్తీమే సవాల్..


` ఆరునెలైనా యుద్ధాన్ని ఆపం
` గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తుంది: ఐఆర్‌జీసీ
కువైట్‌పై బాంబుల వర్షం.. అగ్నికీలల్లో భారీ టవర్
నార్వేలోని యూఎస్ ఎంబసీ వద్ద భారీ పేలుడు
ట్రంప్ మూల్యం చెల్లించుకోక తప్పదు..
` జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజాని హెచ్చరిక
` ఇరాన్ చమురు డిపోలపై తొలిసారి ఇజ్రాయెల్ దాడులు
` ఇరాన్‌కు మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఇస్తాం: నెతన్యాహు
` గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. స్వదేశానికి 52 వేల మంది భారతీయులు
టెహ్రాన్(జనంసాక్షి):పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్‌పై భీకరంగా విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ సైతం ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. శనివారం రాత్రి ఇరాన్ మరోసారి తమపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ దాడుల్లో పలువురు ప్రజలు తీవ్రంగా గాయపడగా.. అనేక భవనాలు దెబ్బతిన్నాయని తెలిపింది. డ్రోన్ల శకలాలు పడడంతో నగరంలోని సోషల్ సెక్యూరిటీ టవర్‌కు మంటలు అంటుకున్నట్లు వెల్లడించింది. దానిలో అనేకమంది ప్రజలు చిక్కుకున్నారని.. మంటలు ఆర్పడానికి అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. దాడులు కొనసాగుతున్నందున సురక్షితమైన ప్రదేశాల్లో తలదాచుకోవాలని కువైట్ సైన్యం ప్రజలకు సూచించింది. మరోవైపు ఆ దేశ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన ఇంధన ట్యాంకులు, పలు ప్రభుత్వ భవనాలకు అంటుకున్న మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు అగ్నిమాపక దళం పేర్కొంది. సౌదీ అరేబియా, ఖతార్‌లలోనూ దాడులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్నందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పినప్పటికీ.. టెహ్రాన్ ఆయా దేశాలపై దాడులు కొనసాగిస్తుండడం గమనార్హం. మరో వైపు ఇరాన్‌కు మద్దతిస్తున్న హెజ్‌బొల్లా నేతలే లక్ష్యంగా దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. బీరుట్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యం చేసుకుంటున్నందువల్ల ఆ ప్రాంతాన్ని వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని స్థానిక ప్రజలను హెచ్చరించింది. సెంట్రల్ బీరుట్‌లోని ఓ హోటల్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
నార్వేలోని యూఎస్ ఎంబసీ వద్ద భారీ పేలుడు
ఐరోపా దేశం నార్వేలోని యూఎస్ ఎంబసీ వద్ద పేలుడు సంభవించింది. ఈ క్రమంలో భారీ శబ్దం వినిపించిందని.. పెద్ద ఎత్తున పొగ వ్యాపించిందని పోలీసులు పేర్కొన్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది.ఓస్లో నగరంలోని యూఎస్ ఎంబసీ ప్రవేశ ద్వారం వద్ద ఈ పేలుడు సంభవించిందని పోలీసులు పేర్కొన్నారు. దీంతో స్వల్ప నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అయితే, ఎవరూ గాయపడలేదని స్పష్టం చేశారు. ఈ పేలుడుకు గల కారణాలు తెలియరాలేదన్నారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఘటనపై అమెరికా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరాన్‌పై అమెరికా`ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఈ క్రమంలో నార్వేలోని యూఎస్ ఎంబసీ వద్ద పేలుడు చోటుచేసుకోవడం గమనార్హం.
ఇరాన్ చమురు డిపోలపై తొలిసారి ఇజ్రాయెల్ దాడులు..!
ఇరాన్‌కు ఆర్థిక జీవనాడి లాంటి చమురు డిపోలపై ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ తొలిసారి వైమానిక దాడులు జరిపింది. దీంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఇరాన్ ఇక్కడి నుంచే చమురును సైన్యం సహా పలు శాఖలకు తరలిస్తుంటుందని ఐడీఎఫ్ వెల్లడించింది. ఆ దేశ సైనిక మౌలిక వసతులను దెబ్బతీయడంలో మరో అడుగు వేశామని పేర్కొంది.అంతకు ముందు దక్షిణ టెహ్రాన్‌లోని చమురు డిపోలు, రిఫైనరీ కాంప్లెక్స్‌పై దాడి జరిగినట్లు ఆ దేశ విÖడియా పేర్కొంది. మొత్తం మూడు డిపోల్లో మంటలు వ్యాపించినట్లు చమురు మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ ఇరానియన్ లేబర్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
మినాబ్‌లో దాడి ఇరాన్ పనే: ట్రంప్
మినాబ్‌లో బాలికల పాఠశాలపై ఇరానే దాడి చేసి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయపడ్డారు. వారి ఆయుధాలకు కచ్చితత్వం, గురి సరిగా లేదన్నారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దాడిలో 150 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే.
కువైట్ ఎయిర్‌పోర్టు ఇంధన డిపోపై దాడి
కువైట్‌లోని కీలక భవనాలపై నేడు కూడా దాడులు జరిగాయి. ఆ దేశ సోషల్ సెక్యూరిటీ భవనంపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద రెండు చమురు డిపోలపై దాడులు జరిగాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
ట్రంప్ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఖమేనీ మతిపై ఇరాన్
ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ పై దాడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మూల్యం చెల్లించుకోక తప్పదని జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజాని హెచ్చరించారు. ఖమేనీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఆయన.. తమ నాయకుడి మతికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘మేము ట్రంప్‌ను వదిలిపెట్టం. ఖమేనీ మతికి ఆయన తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. దాడుల్లో మా నాయకుడితో సహా అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇది సాధారణ విషయం కాదు. దీనికి తగిన రీతిలో మేం ప్రతీకారం తీర్చుకుంటాం’ అని హెచ్చరించారు. ఈ సందర్భంగా యుద్ధం నేపథ్యంలో అనేక మంది అమెరికన్ సైనికులను తాము బంధించామని అలీ మరో పోస్టులో పేర్కొన్నారు. వారిని జైళ్లలో ఉంచినట్లు తెలిపారు. ఇరాన్ దాడుల్లో ఆరుగురు యూఎస్ సైనికులే ప్రాణాలు కోల్పోయారంటూ ట్రంప్ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారన్నారు. నిజానికి చాలా మందే చనిపోయారన్నారు. కొన్ని రోజుల తర్వాత ప్రమాదాలు, కల్పిత సంఘటనలతో మతుల సంఖ్యను పెంచేస్తారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితులపై లారిజాని స్థానిక విÖడియాతో మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోని యూఎస్ బలగాలు బందీగా తీసుకెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. వెనెజువెలాలో మాదిరిగా ఇరాన్‌లో కూడా త్వరగా యుద్ధం ముగించేయాలనుకున్నారని.. కానీ , అది విఫలమైందని అన్నారు. అయితే, యూఎస్ సైనికులను బంధించామంటూ లారిజాని చేసిన ఆరోపణలను అమెరికా ఖండించింది. ఇవి ఆ దేశ ప్రభుత్వ అబద్ధాలు, మోసాలకు మరో నిదర్శనం అని సెంటాకామ్ ప్రతినిధి విÖడియాతో అన్నారు.
ఇరాన్‌కు మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఇస్తాం: నెతన్యాహు
ఇరాన్‌పై భీకర దాడులు కొనసాగుతోన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు ముందు ఇరాన్‌కు మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఇస్తామన్నారు. ప్రజలు ఆ దేశంలోని ప్రభుత్వాన్ని పడగొట్టే క్షణం దగ్గరలో ఉందన్నారు. ఈ దాడులతో తాము ఇరాన్‌ను విభజించడానికి ప్రయత్నించట్లేదని.. నిరంకుశ పాలన నుంచి ఆ దేశానికి విముక్తి కలిగించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇరాన్ విషయంలో తమ ప్రణాళికలోని తదుపరి దశను త్వరలో చేరుకోబోతున్నామని నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో కీలక నేతలను కోల్పోయి.. ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిందని నెతన్యాహు అన్నారు. ఆ దేశంలోని ప్రస్తుత పాలనను అస్థిరపరచడానికి.. ప్రభుత్వంలో మార్పులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అక్కడి పాలక వర్గాన్ని గద్దె దించడానికి ఇదే సరైన సమయమని తెలిపారు. ఆ దేశ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలే స్వయంగా పడగొట్టాలన్నారు. అప్పుడే ఇరాన్`ఇజ్రాయెల్‌లలో శాంతి నెలకొంటుందని తెలిపారు. ఇదీ చదవండి: ఇరాన్ చమురు డిపోలపై తొలిసారి ఇజ్రాయెల్ దాడులు..!
గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. స్వదేశానికి 52 వేల మంది భారతీయులు
అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా స్థావరాలపై దాడుల పేరిట యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ దేశాలపైనా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తోంది. దీంతో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న, యుద్ధ పరిణామాల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారత పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఈ నెల మొదటి వారంలో గల్ఫ్ దేశాల నుంచి 52 వేల మందికిపైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. పశ్చిమాసియాలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.“గల్ఫ్ రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి విమానాల రాకపోకలను పాక్షికంగా పునరుద్ధరించడంతో ఈ నెల 1 నుంచి 7 మధ్యలో 52 వేల మందికిపైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో సుమారు 32 వేల మంది భారత విమానాల్లో ప్రయాణించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. విమాన కార్యకలాపాలు ఇంకా అందుబాటులోకి రాని దేశాల్లో ఉన్న భారత పౌరులు.. స్థానిక రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌ను సంప్రదించాలి” అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. విదేశాల్లోని భారత పౌరుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, సాయం అవసరమైన వారందరికీ అండగా నిలిచేందుకు స్థానిక ప్రభుత్వాలతో కలసి పనిచేస్తున్నట్లు తెలిపింది.పశ్చిమాసియాలో ఉన్న భారత పౌరులు.. స్థానిక అధికారుల మార్గదర్శకాలను, అక్కడి భారత దౌత్య కార్యాలయాలు జారీ చేసే సలహాలను పాటించాలని విదేశాంగ శాఖ సూచించింది. ఇప్పటికే అవసరమైన అడ్వైజరీలను స్థానిక భారత ఎంబసీ, కాన్సులేట్ జారీ చేశాయని తెలిపింది. అత్యవసర సమయాల్లో హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని తెలిపింది. అదే విధంగా విదేశాంగ శాఖ కార్యాలయంలో ఓ ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

 

 

 

ఇరాన్ తదుపరి ‘సుప్రీం లీడర’ ఖరారు!
` దాదాపు ఓ నిర్ణయానికి వచ్చిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స’ !
టెహ్రాన్(జనంసాక్షి):ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరనే దానిపై ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స’ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా ఇంకా పేరును ప్రకటించలేదు. అసెంబ్లీ సభ్యుడు మొహ్సెన్ హెదరీని ఉటంకిస్తూ స్థానిక విÖడియా ఈ విషయం వెల్లడించింది. “సరైన అభ్యర్థి ఎవరనేది నిర్ణయమైంది. ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స’లో ఆయనకు మెజారిటీ ఆమోదం లభించింది” అని మొహ్సెన్ చెప్పినట్లు తెలిపింది. మెజారిటీ సభ్యులను పరిగణనలోకి తీసుకుని ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు మరో సభ్యుడు మొహమ్మద్ మెహదీ మిర్బాఘేరి తెలిపారు.‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స’లో 88 మంది సభ్యులు ఉంటారు. ఆ దేశ చట్టం ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే అధికారం ఈ గ్రూపునకు ఉంది. ఇదిలా ఉండగా.. తదుపరి సుప్రీం నేత నియామకాన్ని అధికారికం చేయడానికి అవసరమైన విధానంపై సభ్యులు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. దీనికోసం ఓ సమావేశం ఏర్పాటు చేయాలని కొంతమంది సభ్యులు కోరుతున్నారని, అయితే.. భద్రతాపరమైన కారణాల దష్ట్యా సమావేశం అవసరం లేకుండానే నిర్ణయం ప్రకటించాలని మరికొందరు భావిస్తున్నట్లు స్థానిక విÖడియాలో కథనాలు వస్తున్నాయి.ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన బాధ్యతలను ఎవరు చేపడతారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దేశ తదుపరి సుప్రీంగా ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆయనకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఎఖీఉఅ)తో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో ముజ్తబా కూడా గాయపడినట్లు సమాచారం.