మహిళా భద్రత తొలి ప్రాధాన్యత

` అమ్మాయిలకు ఈవీ స్కూటీలను ఇవ్వాలనుకుంటున్నాం
` సీఎం రేవంత్ రెడ్డి
` మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నాం
` దేశంలోని ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది
` వారి ఉక్కు సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది
` మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం అభివద్ధి చెందుతుంది
` ప్రజాభవన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
` హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు
` మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం
హైదరాబాద్(జనంసాక్షి):హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రెడ్, ఆరెంజ్ కేటగిరి పరిశ్రమలను ఓఆరఆర్ బయటకు పంపిస్తామని చెప్పారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులకు సన్మానం చేశారు.మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోని ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, ఉక్కు మహిళ సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఎక్కడ అవకాశం ఉన్నా, ఉన్నత పదవుల్లో మహిళలను నియమిస్తున్నామని, హైదరాబాద్ కలెక్టర్‌గా మహిళ బాధ్యత వహిస్తున్నారని, ఎసఐబీ అధిపతిగా మహిళను పెట్టామని, వెయ్యి బస్సులకు మహిళలు యజమానులుగా ఉన్నారని గుర్తు చేశారు. వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే వారిగా స్వయం సహాయక బందాలను తయారు చేశామని, తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్‌లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నామని వివరించారు.మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం ఆర్థికంగా అభివద్ధి చెందుతుందన్న సీఎం, దేశంలో మహిళ శ్రమకు గుర్తింపు లేదని అన్నారు. దేశంలో కుల, జెండర్ వివక్ష ఉందని, అమెరికాలో కూడా వివక్ష ఉందని కానీ అక్కడ కష్టానికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఇక్కడ మాత్రం కష్టపడే వారికి గుర్తింపు ఉండదని, మహిళల ఆర్థిక శక్తిని పెంచాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచే ప్రణాళికలను తయారు చేశామని పేర్కొన్నారు.మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం ఆర్థికంగా అభివద్ధి చెందుతుందన్న సీఎం, దేశంలో మహిళ శ్రమకు గుర్తింపు లేదని అన్నారు. దేశంలో కుల, జెండర్ వివక్ష ఉందని, అమెరికాలో కూడా వివక్ష ఉందని కానీ అక్కడ కష్టానికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఇక్కడ మాత్రం కష్టపడే వారికి గుర్తింపు ఉండదని, మహిళల ఆర్థిక శక్తిని పెంచాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచే ప్రణాళికలను తయారు చేశామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ను పొల్యూషన్ ఫ్రీ నగరంగా మార్చాలని రేవంత్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్‌ను అభివద్ధి చేశారని కొనియాడారు. రెడ్, ఆరెంజ్ కేటగిరి పరిశ్రమలను ఓఆరఆర్ బయటకు పంపిస్తామని, హైదరాబాద్‌లోని డీజిల్ బస్సులను 2026 డిసెంబర్‌లోపు జిల్లాలకు తరలిస్తామని, హైదరాబాద్‌లో 100 శాతం ఈవీ బస్సులను తెస్తున్నామని అన్నారు. డిసెంబర్ 9లోపు డీజిల్ బస్సులు హైదరాబాద్‌లో ఉండవని, హైదరాబాద్‌లో ఏసీ ఈవీ బస్సులు తెస్తామని తెలిపారు. ఈవీ వాహనాలు కొనుక్కుంటే జీరో ట్యాక్స్ అని, కళాశాలకు వెళ్లే అమ్మాయిలకు ఈవీ స్కూటీలను ఇవ్వాలనుకుంటున్నామని వెల్లడించారు.హైదరాబాద్‌లో కాలుష్యం, దోమలు ఎక్కువగా ఉన్నాయంటున్నారని, మూసీని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుపడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళన వద్దంటున్నారా? తొలగింపులు వద్దంటున్నారో స్పష్టత ఇవ్వాలని కోరారు. నష్ట పరిహారం ఇచ్చే బఫర్ జోన్‌లోని ఇళ్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. 50 విÖటర్ల బఫర్ జోన్ అనేది చట్టంలో ఉంది తాను మార్చలేనని, నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపిస్తామని హావిÖ ఇచ్చారు. ఎవరూ విÖతో ఉండరని, ఓట్ల కోసమే విÖ దగ్గరకు వస్తున్నారని తెలిపారు.గాంధీ విగ్రహం కట్టడానికి రూ.500 కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గాంధీ విగ్రహానికి రూ.70 కోట్లే ఖర్చు అవుతుందని సీఎం చెప్పారు. గాంధీ విగ్రహం వద్ద విజ్ఞాన మందిరానికి రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలో మహిళకు రక్షణ మాత్రమే కాదని, అవకాశాలు కూడా ఇస్తామని తెలిపారు. సోషల్ విÖడియాలో అవాస్తవాల ప్రచారంపై ఫిర్యాదులకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.
చెరువుల చెంత ఆర్థిక అభివద్ధి జరగాలి
` మహిళలకు ఆదాయ వనరుగా మారాలి
` బమ్‌రుకున్ ` ఉద్` దౌలా చెరువును ప్రారంభించిన సీఎం రేవంత్
హైదరాబాద్(జనంసాక్షి): చెరువుల చెంత ఆర్థిక అభివద్ధి జరగాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. చెరువులు మహిళలకు ఆదాయవనరుగా మారాలని సూచించారు. ఉదయమే వాకింగ్ చేసుకుంటూ చెరువుల చెంత ఏర్పాటు ఏర్పాటు షాపుల్లో పాలు, కూరగాయలు, పళ్లు కొనుక్కొని వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పాతబస్తీలో ఇటీవల హైడ్రా పునరుద్ధరించిన బమ్‌రుకున్ ` ఉద్ ` దౌలా చెరువును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించి ప్రసంగించారు. నగరంలో అభివద్ధి చేసిన చెరువులన్నీ లేక్ ఎకానవిÖ జోన్‌లుగా మారాలని సూచించారు. ఇదే పరిస్థితి మూసీ చెంత కూడా జరగాలని ఆదేశించారు. గండిపేట చెరువు నుంచి గౌరల్లి వరకూ 55 కిలోవిÖటర్ల మూసీ నదికి ఇరువైపులా నైట్ బజార్లు ఏర్పాటు చేసి నగర ప్రజలకు ఆర్థిక వనరుగా మార్చుతామని ముఖ్యమంత్రి చెప్పారు. వరదలు లేని నగరం ప్రభుత్వ లక్ష్యమని.. ఆ క్రమంలో నిజాంల కాలం నాటి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించే కార్యక్రమాన్ని పెద్దయెత్తున చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజాపాలన`ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా.. హిమయత్‌సాగర్ ఎకో పార్కును ప్రజలకు అందించాం.. నేడు బమకున్ ఉద్ దౌలా చెరువును ప్రారంభించుకున్నామని తెలిపారు. ఒకప్పుడు హైదరాబాద్ రాక్స్, లేక్స్ తో ప్రపంచంలోనే సుందరమైన నగరంగా ఉండింది. ఈ నగరం మనది. దీన్ని రక్షించుకోవలసిన బాధ్యత కూడా అందరిపైన ఉంది.నగర ప్రజలకు కాలుష్యం లేని వాతావరణం, మంచి నీరు, గాలిని , మంచి జీవన ప్రమాణాలను అందించేందుకు చెరువులు దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.నగరంలో పునరుద్ధరించిన అన్ని చెరువుల వద్ద భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. లేక్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయండి. ఆడబిడ్డలకు ఇబ్బందిరాకుండా చర్యలు తీసుకోండి హైడ్రా అభివద్ధి చేస్తున్న చెరువుల చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు తెలిపారు. బమ్‌రుకున్ ` ఉద్ `దౌలా లేక్ విషయంలో కూడా ఆక్రమణలు తొలగించి 4.20 ఎకరాలకు పరిమితమైన చెరువును 18 ఎకరాలకు విస్తరించామని చెప్పారు.అంతకు ముందు చెరువు చెంత ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే అక్కడ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు.



