అంగరంగ వైభవంగా బొడ్రాయి ఉత్సాహాలు -సందడిగామారిన గొల్లచర్ల గ్రామం -బోనం ఎత్తిన ఎంపీ కవిత

 డోర్నకల్ మార్చి/3/ జనం సాక్షి న్యూస్ :అంగరంగ వైభవంగా బొడ్రాయి ఉత్సవాలు. మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో శుక్రవారం శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి జీవద్వాజ ,బొడ్రాయి,శ్రీతల పరమేశ్వరి,విగ్రహల ప్రతిష్ట  ఘనంగా నిర్వహించారు.గ్రామంలో ప్రధాని వీధిలో వేదమంత్రాలతో డప్పు సప్పులతో భారీ ఊరేగింపు నిర్వహించారు.అనంతరం గ్రామ ఆడపడుచులు బొడ్రాయి,ముత్యాలమ్మ తల్లులకు బోనాలు చెల్లించారు.మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సందడిగా మారిన గొల్లచర్ల గ్రామం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డోర్నకల్ శాసనసభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్, మానుకోట పార్లమెంట్ సభ్యురాలు మాలోత్  కవిత,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నూకల నరేష్ రెడ్డి, డోర్నకల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు డిఎస్ రవిచంద్ర బొడ్రాయి వేడుకల్లో పాల్గొని  శ్రీ ఆంజనేయ స్వామి, బొడ్రాయి అమ్మవారి  దర్శించుకున్నారు.గ్రామ ఆడపడుచులతో కలిసి బోనం ఎత్తిన ఎంపీ కవిత.ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ  గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో పశు సంపద, పాడిపంటలతో  పచ్చగా గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలని బొడ్రాయి, ఆంజనేయస్వామి ఆశీస్సులు గ్రామ ప్రజలకు ఎప్పటికీ  ఉండాలని వాళ్లు అన్నారు.అనంతరం పలువురు ప్రజాప్రతినిధులకు శాలువాలతో సన్మానించిన బొడ్రాయి విగ్రహ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు,గ్రామ పెద్దలు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి విగ్రహ కమిటీ సభ్యులు,ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు,మహిళలుతదితరులు పాల్గొన్నారు.