అంతరాష్ట్ర కరాటే పోటీల్లో మంథని, ఏక్లాస్ పూర్

 

 

 

 

 

 

విద్యార్థుల ప్రతిభ జనంసాక్షి, మంథని : హనుమకొండ జిల్లా పరకాలలోని మయూరి గార్డెన్ లో ఆదివారం అంతరాష్ట్ర కరాటే పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మంథనికి చెందిన జపాన్ షిటోరియు కరాటే సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో కటా, కుమితి విభాగాలలో అత్యంత ప్రతిభ కనబరిచి మంథని, ఏక్లాస్ పూర్ విద్యార్థులు బంగారు వెండి పథకాలు సాధించారు. పథకాలు సాధించిన మంథని విద్యార్థులు కే.అశ్విని బాబు, పి. అభిరామ్, ఎం.మణిదీప్, బ్లాక్ బెల్ట్ సీనియర్స్ కుమితీ బాలికల విభాగంలో మెట్టు హాసిని ప్రథమ స్థానం సాధించి ప్రథమ స్థానం సాధించిన వారితో పోటీపడి గ్రాండ్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నది.