అక్టోబర్ 2 న గాంధీ హాస్పిటల్ ముందు మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి కెసిఆర్ .
సికింద్రాబాద్ (జనం సాక్షి ) అక్టోబర్ 2 న గాంధీ హాస్పిటల్ ముందు మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అని ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గాంధీ హాస్పిటల్ ముందు జరుగుతున్న అభివృద్ధి పనుల ను బహిరంగ సభ ప్రాంతాన్ని పరిశీలించరు. గాంధీ విగ్రహ ప్రతిష్ట ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రులు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ. అని తలసాని అన్నారు. గాంధీ ని చంపిన గాడ్సే ను పొగడటం బాధాకరం అని అన్నారు. గాంధీజీ అహింసా విధానాన్ని ప్రపంచ దేశాలు స్ఫూర్తిగా తీసుకుని పట్టిస్తున్నాయి అని ఈ సందర్భంగా గుర్తుచేసిన మంత్రులు.. ఈ కార్యక్రమంలో అధికారులు, గాంధీయ ఆసుపత్రి సూపర్డెంట్ రాజారావు పాల్గొన్నారు.