అక్బరుద్దీన్‌ను హైదరాబాద్‌ తీసుకొచ్చేందుకు పోలీసుల యత్నం

హైదరాబాద్‌ : వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయి ఆదిలాబాద్‌ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు యోచిస్తున్నారు. ఆయనను పీటీ వారెంట్‌ పై నగరానికి తీసుకువచ్చే విషయంలో న్యాయపరమైన అంశాలపై ఓయూ పోలీసులు న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం. అక్బరుద్దీన్‌  ప్రసంగాన్ని ప్రసారం చేసిన ఛానెళ్లకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఛానెళ్లకు నోటీసులు ఇచ్చి అక్బరుద్దీన్‌ ప్రసంగం వివరాలు తీసుకోనున్నట్లు సమాచారం తెలిసింది.