అక్బరుద్దీన్‌ పిటిషన్‌పై తీర్పు 16కు వాయిదా

ఆదిలాబాద్‌: తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలన్న అర్బరుద్దీన్‌ పిటిషన్‌పై తీర్పు 16కు వాయిదా పడింది. నిర్మల్‌ జైళ్లో తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించి, ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆయన కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి తీర్పును జనవరి 16కు వాయిదా వేశారు. రేపటి నుంచి నిర్మల్‌ కోర్టుకు 16 వరకు సంక్రాంతి సెలవులు ఉన్నందున తీర్పును వాయిదా వేశారు.

కస్టడీ పిటిషన్‌ మధ్యాహ్నానికి వాయిదా

అక్బరుద్దీన్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి తీర్పును మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ మధ్యాహ్నమే తీర్పు వెలువడే అవకాశం ఉంది.