అక్రమమైనింగ్‌పై సీబీఐ కేసు

న్యూఢిల్లీ: కర్ణాటక అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ అరోపణలకు సంబంధించి సీబీఐ గురువారం కేసు నమోదు చేసే అవకాశం ఉంది. కర్ణాటక అటవీ ప్రాంతం నుంచి 50.7 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా మైనింగ్‌ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపే క్రమంలో భాగంగానే ఈ చర్యను చేపట్టనుంది.