అక్రమ అరెస్ట్‌లను ఖండించిన జేఏసీ చైర్మన్‌ కోదండరాం

మహబూబ్‌నగర్‌: పాలమూరు జిల్లాలో చంద్రబాబు రాకె సందర్భంగా జిల్లా జేఏసీ నాయకులు రాజేందర్‌రెడ్డి, రామకృష్ణరెడ్డిలతో సహా పలువురు ఉద్యమకారులను విద్యార్థులను, టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలను అరెస్ట్‌ చేయడాన్ని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ఆచార్య కోదండరాం ఖండించారు. చంద్రబాబుకు తెలంగాణలో తిరిగే హక్కు ఎంత ఉందో తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని బాబును అడిగే హక్కు తెలంగాణ ప్రజలకుందన్నారకు. అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.