‘అక్షరం’లోనూ అంతరం!

వెనుకబడ్డ ప్రాంతాల ప్రజలకు విద్య దూరం
యర్రగొండపాలెంలో సగం మందే అక్షరాస్యులు
ఒంగోలు, చీరాల, గిద్దలూరు ప్రాంతాల్లో ముందంజ
పదేళ్లలో అక్షరాస్యతలో పెరుగుదల 6.15శాతమే
ఒంగోలు, జూన్‌ 28 (ఎపిఇఎంఎస్‌): జిల్లాలోని కొన్ని ప్రాంతాలను వెనుకబాటును వీడలేదు. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచని ప్రాంతాలపై పాలకులు ఏనాడూ దృష్టి పెట్టలేదని తేలిపోతోంది. వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు కనీస అవసరాలు అందడం లేదు. చివరకు చదువుల్లోనూ తారతమ్యాలు ూన్నాయని లెక్కలు విదితం చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన వాటితో వెనుకబడిన ప్రాంతాలు అక్షరాస్యతలో పోటీ పడలేక పోతున్నాయి. అక్షరాస్యత పెంపుదలకు ప్రభుత్వం చేపట్టే పథకాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదని దాన్ని బట్టే నిర్ధారణ అవుతోంది. సామాజిక ఆర్థిక ప్రగతి చదువుపైనే ఆధారపడి ూందనడంలో సందేహం లేదు. అక్షరాస్యత తక్కువగా ూన్న ప్రాంతాల్లో వెనుకబాటు తనం ఎక్కువనే విశ్లేషణలకు జిల్లాలో అనేక ప్రాంతాలు నిదర్శనాలుగా నిలిచాయి. 2011జనాభా లెక్కలతో పాటు అక్షరాస్యతా శాతం గణాంకాలనూ సేకరించారు. వాటిని పరిశీలిస్తే అనేక వాస్తవాలు అవగాహన అవుతాయి. అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లోనే అక్షరాస్యతా శాతం పెరిగింది. తాగునీరు, కరువు, వెనుకబాటు తనమున్న నియోజకవర్గాల్లోని ప్రజలు చదువుల్లోనూ వెనుకబడే ూన్నారు. ఆయా ప్రాంతాల్లో ూపాధి దొరక్క ఇతర ప్రాంతాలకు కుటుంబాలతో సహా వలసలు పోవడమే అందుకు కారణంగా ూంది. వలసలున్న ప్రాంతాల్లో అక్షరాస్యత బాగా తక్కువుంది. వెనుకబడిన ప్రాంతమైనా విద్యాసంస్థలు బాగా అభివృద్ధి చెందిన చోట మాత్రం చదువు పట్ల ఆసక్తి కనిపించింది. జిల్లా అక్షరాస్యతా శాతంలో ఆశించిన మార్పులేదు. పదేళ్లలో కేవలం 6.15శాతం పెరుగుదలే కనిపించింది. ఈ కాలంలో ప్రభుత్వం విద్యారంగంపై కోట్లాది రూపాయలు వెచ్చించింది. 2001లెక్కల ప్రకారం జిల్లా జనాభాలో 57.38శాతం అక్షరాస్యులున్నారు. ప్రస్తుతం అది 63.53శాతానికి పెరిగింది. ఇదే కాలంలో పెరిగిన జనాభానూ పరిగణనలోకి తీసుకోవాలి. నియోకవర్గాల వారీగా చూస్తే యర్రగొండపాలెం చదువులో వెనుకబడింది. అక్కడ కేవలం 50.03శాతమే అక్షరాస్యత ూంది. ఆ ప్రాంత జనాభాలో సగం మందే విద్యావంతులు కావడం గమనార్హం. ఆ నియోజకవర్గంలోని మండలాల పరిస్థితి మరీ ఘోరంగా ూంది. పుల్లలచెరువు మండలంలో 39.95శాతమే అక్షరాస్యులున్నారు. త్రిపురాంతకంలో 49.22శాతం ూన్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో చదువుకు ప్రాధాన్యత పెరిగింది. మరోవైపు పురుషులు, మహిళల మధ్య కూడా చదువుల్లో ఊహించని రీతిలో తేడాలున్నాయి. జిల్లాలో పురుషుల అక్షరాస్యత 75.53శాతంగా ూంది. స్త్రీలు 53.40శాతమే చదువుకున్నట్లు తేలారు. బాలికల విద్య పట్ల ప్రభుత్వం ప్రత్యేక పథకాలు, విద్యాసంస్థలను ఏర్పాటు చేసినా ఫలితం లేదు. వాటిల్లో సౌకర్యాలు ఏర్పాటు చేసి చదువు చెప్పడంలో వైఫల్యం కనిపిస్తోంది. జిల్లాలో అక్షరం ముక్కరాని వారు జనాభాలో 37శాతంగా ూన్నారు. నిరుపేదల్లోనే నిరక్షరాస్యత ఎక్కువగా ూంది. గ్రామీణ ప్రాంతాల్లో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు చెందిన కుటుంబాల్లోని పిల్లలను ఇప్పటికీ చదువుల కన్నా పనులకు పంపడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కువ కుటుంబాల్లో పిల్లలను బేల్దారు పనులకు హైదరాబాదుకు పంపుతున్నారు. యుక్తవయస్సులో వలసలు పోయిన వారు జిల్లాలో సుమారు లక్షమందికిపైగా ూన్నట్లు అంచనా. ముందే వేతన ఒప్పందాలు కుదుర్చుకుని పిల్లలను పంపే విధానమూ అమల్లో ూంది. వారంతా చదువులకు దూరమవుతూనే ూన్నారు. కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగు పడందే విద్యకు ప్రాధాన్యత ఏర్పడే స్థితి లేదు. ప్రభుత్వం చేపట్టే పథకాలను ప్రజలకు చేరువ చేయడంలోనూ వైఫల్యం కనిపిస్తోంది. రెండు దశాబ్ధాలుగా సంపూర్ణ అక్షరాస్యతా సాధనకు చేస్తున్న కృషి అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు చందంగా సాగుతోందని ఈ లెక్కలు విదితం చేస్తున్నాయి.
నియోజకవర్గాల వారీ అక్షరాస్యతా శాతాలివీ….
అత్యధికంగా ఒంగోలు 77.19శాతం ,
అత్యల్పంగా యర్రగొండపాలెం 50.3శాతం ,
చీరాల 72.82శాతం ,
దర్శి 54.20శాతం ,
పర్చూరు 65.82శాతం ,
అద్దంకి 61.14శాతం ,
సంతనూతలపాడు 64.90శాతం ,
కందుకూరు 60.66శాతం ,
కొండపి 61.80శాతం ,
మార్కాపురం 61.73శాతం ,
కనిగిరి 63.75శాతం ,
గిద్దలూరు 66.80శాతం ,