అగ్నిప్రమాద ఘటనపై సీబీసీఐడీ విచారణ

హైదరాబాద్‌: బేగంపేట విమానాశ్రయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. ఘటన గురించి వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. బేగంపేట విమానశ్రయంలో సోమవారం అర్థరాత్రి మంటలు ఎగసిపడి ఏవియోషన్‌కు చెందిన రెండు చార్టర్‌ విమానాలు పూర్తిగా దగ్థమయ్యాయి.