అగ్ని ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ భేటీ

హైదరాబాద్‌: బేగంపేట విమానాశ్రయంలో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సచివాలయంలో భేటీ అయింది. అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు ఇచ్చిన ప్రాథమిక నివేదికను కమిటీ పరిశీలించింది. సోమవారం అర్థరాత్రి విమానాశ్రయంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో సీఎం ప్రయాణించే ఆగస్టా హెలికాప్టర్‌తోపాటు ఆరు శిక్షణ విమనాలు కాలి బూడిదైన విషయం తెలిసిందే.