అగ్రహారంలో ట్రాక్టరు ఢీకొని విద్యార్థి మృతి

జగ్గయ్యపేట : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని అగ్రహారం గ్రమంలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని వెనుకనుంచి వచ్చిన ఇసుక ట్రాక్టరు ఢీకొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామానికి చెందిన పట్టపు రాజ్‌కుమార్‌ (13) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నట్లు బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్థులు విద్యార్థి మృతికి నిరసనగా జగ్గయ్య పేట-ముత్యాల రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. గ్రామానికి బైపాస్‌ ఏర్పాటు చేయాలని మృతుని కుటుంబానికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు.

తాజావార్తలు