అజర హాస్పిటల్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 30(జనం సాక్షి)
వరంగల్ మహానగరంలోని ములుగు రోడ్లో ఉన్న ఆజర హాస్పిటల్లో గురువారం సాయంత్రం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్ లో పనిచేస్తున్న మహిళా సిబ్బంది తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మని పండుగ లో భాగంగా రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆడుతూ పాడుతూ సంబరాలు నిర్వహించారు హాస్పిటల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది