అట్టహాసంగా టిఆర్‌ఎస్‌ ప్లీనరీ ప్రారంభం

వరుసగా తొమ్మిదోసారి అధ్యక్షుడిగా సిఎం కెసిఆర్‌
పార్టీ జెండా ఆవిష్కరించి, అమరులకు నివాళి
రాజీలేని పోరాటంతోనే తెలంగాణ సాధించాం
అధ్యక్ష ఉపన్యాసంలో సిఎం కెసిఆర్‌ ఉద్ఘాటన
హైదరాబాద్‌,అక్టోబర్‌25 (జనంసాక్షి):  హైదరాబాద్‌ హైటెక్స్‌లో టిఆర్‌ఎస్‌ ప్లీనరీ అట్టహాసంగా ప్రారంభ మయ్యింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ రెడ్డి ప్లీనరీ వేదికగా ప్రకటించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ పేరును ప్రతిపాదిస్తూ మొత్తం 18 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీలోని అన్ని విభాగాలు, అన్ని సామాజికవర్గాల నేతలు కేసీఆర్‌ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలుచేశారు. అధ్యక్ష పదవికి ఇతరులెవ్వరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో కేసీఆర్‌ ఎన్నిక ప్రకటన ఏకగ్రీవమైంది. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ ఇప్పటివరకు వరుసగా ఎనిమిదిసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇది 9వ సంస్థాగత ఎన్నిక. చివరిసారిగా 2017లో రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నిక జరిగింది. 2019లో పార్లమెంట్‌ ఎన్నికలు, 2020, 2021లో కరోనా కారణంగా పార్టీ ప్లీనరీ నిర్వహించలేదు. హైటెక్స్‌లో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ అట్టహాసంగా ప్రారంభమైంది. సీఎం కేసీఆర్‌ సహా ఇతర నేతలంతా హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేసీఆర్‌ అధ్యక్షుడిగా టీఆర్‌ఎస్‌ కీలక నేత కేకే అధికారికంగా ప్రకటించారు. మూడేళ్ల తర్వాత ప్లీనరీ నిర్వహిస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. తొలిసారి 2001లో జలదృశ్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించామన్నారు. రకరకాల అపనమ్మకాల మధ్య గులాబి జెండా ఎగిరిందని.. ఎప్పటి కప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ ప్రత్యేక తెలంగాణ సాధించామన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాలను నిర్దేశించిందన్నారు. ఇది శాశ్వతంగా ఉండే కీర్తి అని కేసీఆర్‌ అన్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్‌ పార్టీ జెండా ఆవిష్కరించి ప్లీనరీని ఏర్పాటు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి.. అమరవీరులకు నివాళులర్పించారు. ప్లీనరీ ప్రారంభంలో అమరవీరులను, మరణించిన పార్టీ నేతలు, కార్యకర్తలను సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. 20 ఏండ్ల పార్టీ ప్రస్థానంలో తమతో అనేక మంది కలిసి పనిచేశారని అన్నారు. పార్టీకి నిబద్ధులైన నాయకులు కీర్తిశేషులయ్యారని, చరిత్రలో వారిపేర్లు చిరస్థాయిగా నిలవాలని చెప్పారు. కీర్తి శేషులైన పార్టీ నాయకులకు ప్లీనరీ సంతాపం తెలిపింది. రామలింగారెడ్డి, చందూలాల్‌ తదితరులకు ప్రతినిధుల సభ రెండు నిమిషాలపాటు మౌనం పాటించింది. అనంతరం కెసిఆర్‌ మాట్లాడుతూ తనను అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకోవడంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. అనేక అవమానాలు ఎదుర్కొని, రాజీలేని పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్టాన్న్రి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నా మని, మన పథకాలను ఇతర రాష్టాల్రు మాత్రమే కాకుండా, కేంద్రం కూడా కాపీ కొడుతుందని కేసీఆర్‌ అన్నారు. ప్లీనరీ వేదికలో ఆశీనులైన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిదులకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. 20 సంవత్సరాల ప్రస్థానం తర్వాత మళ్లీ ఒకసారి అద్యక్ష బాధ్యతలు చేపట్టివల్సిందిగా,
ఏగక్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను. 2001, ఏప్రిల్‌ 27 స్వర్గీయ కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశ్రయం జలదృశ్యం ఆవరణలో ఈ గులాబీ పతాకాన్ని ఆవిష్కరించాము. ఆనాడు విపరీతమైన అపనమ్మక స్థితి. గమ్యం విూద స్పష్టత లేనటువంటి అగమ్య గోచర పరిస్థితి. ఉద్యమం విూద అప్పటికే ఆవరించుకున్న అనుమానాలు, అపోహాలు, దుష్పచ్రారాలు.. రకరకాల అనుమానాస్పదస్థితుల మధ్య గులాబీ జెండా ఎగిరింది. నాడు తెలంగాణ సమాజం విశ్వాసం లేనటువంటి స్థితిలో ఉంది. ఈ సమాజం ఆ స్థితి నుంచి బయటకు రావాలని మాట్లాడుకున్నాం. దేశ స్వాతంత్య పోరాటం మహాత్మగాంధీ ఆధ్వర్యంలో సాగింది. స్వాతంత్య సమరబాటలో 287 సార్లు అనేక ఉద్యమాలకు పిలుపునిచ్చి, వాటిని వాపస్‌ కూడా తీసుకున్నారు. 1857లో సిపాయిల తిరుగుబాటు విఫలమైంది. జలియన్‌ వాలాబాగ్‌ మారణకాండ జరిగింది. అయినా స్వాతంత్య పోరాటం ఆగలేదు. విజయం సాధించింది. ఆ పంథాలోనే తెలంగాణ ఉద్యమం సాగింది. స్పష్టమైనటువంటి మార్గాన్ని నిర్దేశిరచుకుని ముందుకు సాగడం జరిగింది. విూలో చాలా మంది మొదటి రోజు నుంచి నేటి వరకు పని చేస్తూనే ఉన్నారు. సిపాయిల తిరుగుబాటు విఫలమైంది అని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్యర్ర.. రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది.. ముమ్మాటికీ తెలంగాణ వచ్చి తీరుతుందిని అని నిర్ణయించుకున్నాం. అలా అనేక రకాలుగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాము. సమైక్యవాదులు అనేక అడ్డంకులు సృష్టించారు. చేయని ప్రయత్నం లేదు. వేయని నిందలు లేవు. పెట్టని తిప్పలు లేవు. ఎన్ని జేయాల్నో అన్ని చేశారు. చివరికి రాజ్యసభలో బిల్లు పాస్‌ అయ్యే ముందు కూడా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారు. మనం కూడా అంతే పట్టుదలతో ఎప్పటికప్పుడు వివ్లేషించుకుంటూ ముందుకు సాగినం కాబట్టి విజయతీరాలకు చేరి రాష్టాన్ని సాధించుకున్నాం. తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాలకు కొత్త బాటను చూపాయి. చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు శాశ్వతంగా కీర్తి ఉండిపోతుంది అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.