అనారోగ్యం, ఆకలి సమస్యలను కలిసికట్టుగాఎదుర్కోవాలి

హైదరాబాద్‌ : అంతర్జాతీయ జీవ వైవిధ్యం సదస్సుకు హైదరాబాద్‌ వేదిక కావడం సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. హైదరాబాద్‌ హైచ్‌ఐసీసీలో ప్రారంలబమైన జీవ వైవిధ్య సదస్సులో గవర్నర్‌ ప్రసంగించారు. సర్వ జీవాలకు, సృష్టి మూలాలకు శాంతి అవసరమనేది ఆర్యోక్తి అని ఆయన అన్నారు. మానవ చరిత్రలో పర్యావరణానికి చాలా ప్రియుఖ్యత ఉందని పేర్కొన్నారు. అనారోగ్యలు, ఆకలి సమస్యలను అందరూ కలిసికట్టుగా ఉదుర్కోవలని పిలుపునిచ్చారు. పర్యావరణానికి అధిక క్రిమిసంహారక మందులు వాడకం హానికరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జల వనరులు అడుగంటిపోవడం. సాగు భూములు తగ్గుదలపై సదస్సు చర్చించి సూచనలు ఇవ్వాలని కోరారు.