కలప అక్రమ నిల్వలపై జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు

35 కలప దుంగలు స్వాధీనం

అటవీశాఖ అధికారులకు అప్పగింత:టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్

గంభీరావుపేట జూన్ 10 (జనం సాక్షి);గంబిరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన చంద్రమౌళి తండ్రి బాలకిష్టయ్య తన ఇంటి ఆవరణలో అటవీ శాఖ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా 35 కలప దుంగలను నిల్వ ఉంచడాన్నా విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సిబ్బంది అక్రమ కలప నిల్వలు, రవాణాపై మెరుపు దాడులు చేయగా గుర్తించిన 35 కలప దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నటేష్ తెలిపారు.స్వాధీనం చేసుకున్న కలప దుంగలను తదుపరి చర్యల నిమిత్తం అటవీశాఖ సెక్షన్ అధికారి పద్మాలతకు అప్పగించినట్లు వెల్లడించారు.అక్రమంగా కలప నిల్వలు, రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ప్రజలు అటవీ సంపద పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుళ్లు తిరుపతి, ఉమాపతి, రాజేష్, శ్రీనివాస్, శివ పాల్గొన్నారు.