రైలులోనే మహిళ ప్రసవం

ఆడబిడ్డకు జననం

వరంగల్ ఈస్ట్, జూన్ 10 (జనం సాక్షి) బీహార్‌కు చెందిన ఆర అంజుం (27) గర్భిణీగా కుటుంబ కార్యక్రమానికి హాజరై బెంగళూరు నుంచి తిరుగు ప్రయాణం చేస్తుండగా బుధవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నాలుగో కాన్పు కావడంతో ప్రయాణ సమయంలోనే పురిటి నొప్పులు తీవ్రంగా రావడంతో వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద రైలును నిలిపివేశారు. .తక్షణమే 108 ఎమర్జెన్సీ సర్వీస్‌కు సమాచారం అందించగా, ఈఎంటి కె. నాగరాజు, పైలట్ పి. అమర్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. వారి సాయంతో ట్రైన్‌లోనే సురక్షితంగా ప్రసవం జరగగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ఈ సమయంలో ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులు 108 సిబ్బంది వేగవంతమైన స్పందనను ప్రశంసించారు. అనంతరం తల్లి, బిడ్డను మెరుగైన చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.