ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులతో కూడిన ఉత్తమ విద్య
మిడ్జిల్. జూన్ 10 (జనం సాక్షి)ప్రభుత్వ పాఠశాలలోనే అన్ని వసతులతో కూడిన విద్య ను బోధించబడుతుందనీ పాఠశాల ఉపాధ్యాయులు అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా దోనూర్. ఈదుల బాయి తండ. గ్రామపంచాయతీలలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం తరఫున అందజేసే వసతుల గురించి విద్యాబోధన గురించి వివరించారు ప్రభుత్వ పాఠశాల ల్లో ఉత్తమ విద్యా బోధన ఉంటుందని మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఉత్తమమైన విద్యాబోధనను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామాల సర్పంచులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు



