అనుబంద చార్జీషీటును దాఖలు చేసిన సీబీఐ

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ అనుబంధ ఛార్జీసీటును దాఖలు చేసింది. మొదటి ఛార్జీషీటులో తెలిపిన కంపెనీల నుంచి వచ్చిన పెట్టుబడులన్నీ ముడుపులేనని సీబీఐ తెలిపింది. ఈ మేరకు ఆధారాలతో సహా నాంపెల్లిలోని సీబీఐ న్యాయస్థానానికి సమర్పించింది. చెన్నైకి చెందిన జగదీశన్‌ ఆడిటర్స్‌ ప్రతినిధి ప్రభాకరన్‌తో పాటు జగతి పబ్లికేషన్స్‌లో డైరెక్టర్‌గా ఉన్న హరీశ్‌ కామర్తి వాంగ్మూలాలను సీబీఐ చార్జీషీటులో దాఖలు చేసింది. వీరిద్దరి వాంగ్మూలాలను భారతీయ శిక్షాస్రృతి సెక్షన్‌ 161ప్రకారం సీబీఐ నమోదు చేసింది.