అనుమతి లేకుండా నడిపిస్తున్న ఆస్పత్రిలను సీజ్ చేసిన డిఎం అండ్ ఎచ్ ఓ

జహీరాబాద్ సెప్టెంబర్ 22 (జనం సాక్షి )డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పది రోజులలో రాష్ట్రంలోని అనుమతులు లేని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడం కోసం ఆదేశాలు జారీ చేయడం జరిగినది అని దీని ప్రకారం శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గాయత్రీ దేవి ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న స్పర్శ స్కిన్ మరియు ఇఎన్టి, సిద్ధి హాస్పిటల్,, యుద్ధ డయాగ్నస్టిక్ సెంటర్ లను సీజ్ చేయడం జరిగింది., సంగారెడ్డి జిల్లాలో అనుమతులు లేని ప్రైవేట్ ఆస్పత్రులు డయాగ్నస్టిక్ సెంటర్స్ పాలి క్లినిక్ లను ఫిజియో థెరపీ సెంటర్లపై చర్యలు తీసుకోవడానికి పోగ్రామ్ ఆఫీసర్లను నియమించడం జరిగినట్లు తెలిపారు.