‘అన్యాయ’ న్యాయానికి ఆమోదమా?

నేరస్థులకు శిక్ష పడకపోవడానికి నేర విచారణ వ్యవస్థ కఠినంగా లేకపోవడం కాదు కారణం. నేర పరిశోధనలో పోలీసులు అసమ ర్ధత, నేర నిర్ధారణ పై పౌరుల అనాసక్తి దీనికి ప్రధాన కారణాలు. మన కళ్ల ముందే క్రూరంగా తయారవుతున్న సామాజిక సంస్కృంతికి దుండ గుల ఎన్‌కౌంటర్‌లు పరిష్కారం అను కోవడం వివిధ స్థాయిల్లోని సామాజిక బాధ్యతను విస్మరిం చడం అవుతుంది.
స్వప్నిక, ప్రణీతలపైన ఆసిడ్‌ దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారని వినగానే ఇక వారిని చంపేస్తారనుకున్నారు. చట్టం అను కూలించకపోయినా ప్రజాగ్రహం అనుమతి స్తుందనుకుంటే హత్య చేయడానికి వెనకాడే బల హీనులు కాదు మన పోలీసులు. ముద్దాయి లకు పెద్ద వాళ్లతో సంబంధాలుగానీ బందుత్వవంగానీ ఉంటే వేరే సంగతిగానీ, లేనట్టయితే వారిని కోర్టులో ప్రవేశపెట్టి నేర పరిశోధన చేసి సమర్థం గా నేర విచారణ జరిపించడం టైంవేస్ట్‌ అన్న అభిప్రాయానికి పోలీసు యంత్రాంగం వచ్చేసింది. చంపేసి ప్రజల భుజాలెక్కి హీరోలుగా ఊరిగితే ఒక పనైపోతుందన్న నిర్ణయానికి వచ్చేసింది. అందులోనూ వరంగల్‌ జిల్లా పోలీసు యంత్రాం గానిది మరీ బరి తెగించిన వైఖరి. ఈమధ్యకాలం లోనే ఇది వారు చేసిన నాల్గవ హత్య సంఘటన. వారి చేతిలో హతమైన వారు అసాంఘిక నేరాల కు పాల్పడినవారు కాబట్టి వారి పైన సమాజంలో సహజంగానే కోపం ఉంటుంది. ఆ కోపాన్ని అడ్డం పెట్టుకొని వారిని చంపేసి ప్రశ్నించిన వారి పైరి జనాన్ని ఎగదోయడం వరంగల్‌ పోలీసులు నేర్చుకున్నారు. ఇది నిజమైన ఎన్‌కౌంటర్‌ అయితే అందులో తప్పేమీ లేదు. అని మాజీ హోం మంత్రి కోడెల శివప్రసాద్‌రావు అన్నారు. తెలుగు దేశం పార్టీ అధికారం కోల్పోయిన తరువాత అన్ని విషయంలోనూ అభిప్రాయం మార్చుకుంది గానీ ఈ ఒక్క విషయంలో మాజీ హోంమంత్రికి ప్రస్తుత హోం మంత్రికి అభిప్రాయ భేదం లేదు. ఎన్‌కౌంటర్‌ లు చేయించడం అధికారంలో ఉన్న పార్టీని నీతి మాత్రమే, పాలక నీతి అనడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. అది నిజమైన ఎన్‌కౌంటర్‌ అని పామరులు సహితం అనుకో వడం లేదు. మరి ఉన్నత విద్య అభ్యసించిన మాజీ హోంమంత్రికి అయి ఉండవచ్చునని ఎట్లా తోచిందో పోలీసులు సహితం అవి నిజమైన ఎదురు కాల్పులని వవరీ నమ్మించే ప్రయత్నం చేయడం లేదు. ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడ ినందుకు కాదు వారు ప్రజలు అభినందనలు కోరుకున్నది.
దుర్మార్గులను హత్య చేసినందుకు కోరుకున్నారు. అభినందించిన వారు అందుకే అభినందించారు. చేసిన వారికీ మెచ్చుకునేవారికీ లేని విచక్షణ వ్యాఖ్యానించేవారికెందుకు? ఈ న్యాయస్థానాలు దుర్మార్గులను నిజంగానే శిక్షించ జాలవనీ, దాని కోసం కఠనతరమైన చట్టాలు కావాలంటే హక్కులు సంఘాలు అడ్డుపడు తున్నాయనీ వాదించడం ద్వారా పోలీసులు హత్యాకాండకు అంతిమంగా కఠనమైన చట్టాలను వ్యతిరేకించేవారూ బాధ్యలేనంటున్న వారు ఉన్నారు. దీనికి రెండు జవాబులున్నాయి. ఒకటి, ఈ కేసు విషయంలో ఇది పూర్తిగా అసందర్భమైన వ్యాఖ్య ఆ ముగ్గిరిని కోర్టులో విచారించి ఉంటే సెక్షన్‌ 307 జీవిత ఖైదు పడి ఉండేది. బాధితురాళ్లు వాళ్లనుగుర్తుపట్టారు.
దాడికి ఆసిడ్‌ కొనుకున్న దుకాణాన్ని పోలీసులు గుర్తించారు. గతంలో ముద్దాయిలు పాల్పడిన కక్షపూరిత చర్యలకూ స్వప్నిక కుటుంబ సభ్యులు సాక్షం ఉంది. సాక్షులు తెలిసీ నిజం చెప్పకపోవడానికి ముద్దాయిలేం మద్దలచెరువు సూర్యనారయణ రెడ్లు కారు. నందమూరి బాల కృష్ణలు కారు. క్రూరంగా తయారైన మామూలు మనషులు. ఇంత సాక్ష్యం ఉండగా వారికి కోరు ్టలో శిక్ష పడకపోడంకల్ల. పైగా ఆసిడ్‌ దాడిని చిన్న నేరంగా పరిగణించవద్దనీ చట్టం అనుమతించే గరిష్ట శిక్షవేయడమే ఉచితమనీ ఈ మధ్యనే సుప్రీం కోర్టు ఒక తీర్పులో అనిందికూడ. కోర్టు ఒకవేళ శిక్ష వేసినా కొన్నేళ్లకే ప్రభుత్వం క్షమాభిక్ష పేరిట వారిని ముందుగా విడుదల చేస్తుంది కదా అనే వారూ ఉన్నారు.
క్షమాభిక్ష మంచి చెడుల గురించి చాలా వాదించుకోవచ్చు గానీ అసలు విషయం ఏమిటంలే ఈ మధ్యకాలంలో ముందస్తు విడుదల ఆదేశాల్లో అ సాంఘిక నేరాలకు పాల్పడిన వారిని మినహాయించ రివాజైంది. కాబట్టి వీరి విషయం లో ఆ ఆందోళన కూడ అనవసరం కాగా, ఒక సాధారణ వ్యాఖ్యగానైన ఈ మాటలకు ఎంత వరకు సబబని ఏం తెలిసి మాట్లాడుతున్నారని అడగవలసి ఉంటుంది. నేరస్థులకు శిక్ష పడక పోవడానికి నేర విచారణ వ్యవస్థ కఠినంగా లేకపోవడం కాదు కారణం.
నేరపరి శోధనలో పోలీసుల అసమర్ధత, నేర నిర్ధారణ పట్ల పౌరులు అనాసక్తి దీనికి ప్రధాన కారణాలు. పౌరులు అనాసక్తి గురించి ఇంకెప్పు డైనా మాట్లాడుకుందాం గానీ, తమ చట్టబాహ్య మైన నడవడికకు నేర విచారణా వ్యవస్థ వైఫల్యా న్ని పోలీసులు కవచంగా వాడుకోవడమే కాక అందుకు చాలా మంది నుంచి సమర్థన కూడ పొందుతున్నారు. కాబట్టి సామర్థాన్ని గురించి మాట్లాడుకోడం ఉచితంగా ఉంటుంది. నూటికి తొంభై కేసుల్లో వారు చేస్తున్న నేర పరిశోధన ఏమిటంటే అడ్డదార్లు తొక్కి నేరానికి సంబంధిం చిన వస్తువులను స్వాధీనం చేసుకోవడం, లేదా చేసుకున్నట్టు రిపోర్టు కల్పించడం, అందుబాటులో ఉన్న నలుగురు సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయడం, దానిని దీనిని కలిపి చార్జిషీట్‌ అని పేరు పెట్టి కోర్టు ముఖాన కొట్టడం ఇంతకంటే వారికి తిరికా లేదు . శిక్షణా లేదు. రాజకీయ నాయకులకు అధికారికంగా అనధికారింగా సేవ లు చేయాలి. తగువులు తెంపి పైసలు దండు కోవాలి, రాజకీయ పార్టీల మీటింగులకూ రోడ్‌షో లకు బందోబస్తు ఏర్పాటు చేయాలి, ఏలినవారికి ఇష్టంలేని కార్యకలాపాలు సాగకుండ చూడాలి.
ఎన్ని పనులో వారికి! కొంత వ్యవస్థ నుంచి వచ్చినది; కొంత తమ వైఖరీ నుంచి వచ్చినది. అయిన ఈ అసమర్థత నేర నిర్ధారణ విఫలం కావడానికొక ముఖ్యకారణం కాగా , మళ్లీ తమకే విసృత అధికారాలు ఇవ్వడం ద్వారా ఆవై ఫల్యాన్ని పరిష్కరించాలని వారు దబాయి స్తున్నారు. ప్రపంచంలో అతి కొద్ది మందికి ఈ రకంగా వాదించే అదృష్టం లభిస్తుంది. కాగా, నేర విచారణ వ్యవస్థ కఠినంగా ఉండాలి అని కోరు కునే వారు ఏరకమైన కాఠిన్నాన్ని కాంక్షిస్తున్నారో స్పష్టంగా చెప్పమని అడగడం అవసరం ఏం కావాలి వారికి? నేరం న్యాయబద్ధంగా రుజువు కావాలి అనే సూత్రాన్ని సడలించాలా? ముద్దాయి చేత పోలీసు కస్టడీలో నేరం ఒప్పించి శిక్షించ డానికి వీలు లేదని ప్రాసిక్యూషన్‌ నేరాన్ని రుజువు చేయాలని చెప్పె సూత్రాన్ని సడలించాలా? ముద్దా యి సమక్షంలోనే సాక్ష్యాలు నమోదు కావాలనీ సాక్షులను ఎదురు ప్రశ్న వేసే హక్కు ముద్దాయి ఉండాలని చెప్పే సూత్రాన్ని సడలించాలా? దేన్ని సడలిస్తే నేర విచారణ వీరి దృష్టిలో తగినంత కఠినం అవుతుంది? ఈ మార్పులు చేస్తే నేర విచారణే అన్యాయమైన రూపం తీసుకోదా? అన్యాయంగా న్యాయం చేయడం ఒక నాగరికం సమాజం చేయదగ్గపనేనా? చట్టాలనూ కోర్టుల నూ పక్కన పెడదాం.
మన కళ్ల ముందే క్రూరంగా తయార వుతున్న సామాజిక సంస్కృతికి దుండగులు ఎన్‌కౌంటర్‌లు పరిష్కారం అనుకోవడం వివిధ స్థాయిలోని సామాజిక బాధ్యతను విస్మరించడం అవుతుంది. పిల్లలు మానవతా విలువలకు దూర మవుతుంటే తల్లి తండ్రులు ఏం చేస్తున్నారనీ అడగన్కర్లేదు. వారు విద్యార్థులైతే వారి అధ్యా పకులు ఏం చేస్తున్నారని అడగనక్కర్లేదు. వారితో కలిసి సినిమాలకూ షికార్లుకూ పోయే స్నేహితులు ఏం చేస్తున్నారని అడగనక్కర్లేదు. ప్రజాజీవి సం స్కృతిని అమనవీయంగా తయారుచేస్తున్న సకల సంస్కృతి బేహారులనూ మీ వ్యాపార లాభాల కోసం మీరేం చేస్తున్నారనీ అడగక్కర్లేదు. సరైన సమయం వచ్చినపుడు ఒక సజ్జనార్‌ చేప్తేచాలు, వారే కాగల కార్యం జరిపించేస్తారు. ఆ తరువాత మళ్లీ మరొక స్వప్నిక మీద దాడి జరిగేంతవరకు బతకు ఎప్పటిలాగే గడిచి పోతుంటుంది కానీ ఒక ఘటన నుంచి మరొక ఘటనకు పోయేట్టప్పటకీ జరిగిదేమిటంటే పోలీసుల చట్టం బాహ్యమైన హింసాకాండకు సాధికరత పెరగడం. ఇది అన్నిరకాలుగా సమాజానికి నష్టకరం విచ్చలవిడి తనం ఈ హింసాకాండ ప్రముఖ లక్షణం అధికా రం తప్ప దానికి వేరే ప్రమాణం లేదు.
భయం తప్ప వేరే నీతి లేదు. ఎవరిని శిక్షించాలో వారిని శిక్షిస్తుంది. ఎవరిని కాపాడాలో వారిని కాపాడుతుంది హింసాకు గురైన స్త్రీల రక్షకులుగా పోలీసులివాళ ముందుకొచ్చారు. ఒక సంవత్సరం కింద విశాఖపట్నం,ఏజెన్సీలో ని వాకపల్లి అనే గ్రామంలో 11 మంది ఆదివాసీ స్త్రీలు గ్రేహౌండ్స్‌ పోలీసులు తమ ఊరిమీద దాడ ిచేసి తమపైన అత్యాచారం చేశారని ఆరోపిం చారు. ఒకసారికాదు, ఒక వేదిక దగ్గర కాదు, పలుమార్లు ఆరోపించారు. కాని ఆ కేసులో చట్ట బాహ్యమైన న్యాయం కాదు సరికదా చట్టబద్దమైన న్యాయం సహితం పోలీసులు జరగనివ్వలేదు.
హైకోర్టు ఆదేశించినా జరపలేదు. ఆ అత్యచారానికి పాల్పడ్డ వారి జాబితా సజ్జనార్‌కిస్తే అక్కడ కూడ న్యాయం చేసేసి పాడేరులో ప్రజల భుజాలెక్కి ఉరేగుతారా? వరంగల్‌ ఘటనలో మీడియా పాత్ర గురించి రెండు మూడు మాటలు చెప్పకుండ ముగించడం భావ్యం కాదు. ముంబై లో జరిగిన దాడి సందర్భంగా ప్రజల్లో ప్రతీకా రేచ్చను విపరీతంగా రెచ్చగొట్టడంలఅఓ మీడియా పాత్ర గురించి మాబోటి వాళ్లం విమర్శిస్తే మాకు దేశభక్తి కరవైంది అన్నారు. గానీ రెండు రోజుల క్రితం దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాలకృష్ణ న్‌ అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆయన ఒక సెమినార్‌లో మాట్లాడు తూ ప్రతికార కాంక్షను రెచ్చగొట్టే పద్దతిలో వార్తల ప్రసారం చేస్తే ప్రభుత్వంపైన తొందర పాటు నిర్ణయాలు తీసుకునేటట్లు ఒత్తిడి పెట్టడం అవు తుందని, ప్రజల ఏపౌర హక్కులకు భంగం కలి గించే చట్టాలు రూపొందించే దిశగా ఒత్తిడి పెట్టడం అవుతుందనీ, చాలా నష్టకరమనీ అ న్నారు. వరంగల్‌ ఘటనలకూ ఇది వర్తిస్తుంది. తక్షణం ప్రతీకారం కావాలని స్వప్నిక , ప్రణీతలు కోరకోవడం సహజం. కానీ ఆ కోరికను వరంగల్‌ యువత చేత అడిగి అడిగి చెప్పించిన దృశ్య మీడియా వైఖరీని ఆమోదించడం కష్టం. జరగబోయే ఎన్‌కౌంటర్‌కు ఇది భూమిక ఏర్పాటు చేసింది. ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యంగా అంగంగా ఉన్న మీడియా ప్రజాస్వామాన్ని పెంపోదించే దిశగా నడుచుకోవాలి తప్ప నాశనం చేసే దిశగా కాదు. సెన్సేషన్‌ కోసం ఇట్లాగే చేసుకుంటూ పోతే ఇతర ప్రజాస్వామ్య విధ్వంసాకులను నిలదీసినట్టే మీడియాను నిలదీసే రోజులొస్తాయి.
కె. బాలగోపాల్‌